మీ మరిది నా వల్ల సఫర్ అవుతున్నాడు.. లేటర్ రాసి మహిళ అదృశ్యం

దిశ, కూకట్‌పల్లి : నా వల్ల మీ మరిది చాలా సఫర్ అవుతున్నారు. చేయని తప్పుకు బాధ భరించలేను అంటూ.. ఓ గృహిణి సూసైడ్ నోట్ రాసి తన కన్న కూతురు చేతిలో పెట్టి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సీఐ వహీదుద్దిన్ ​తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ బాల్​రెడ్డి నగర్‌కు చెందిన శృతి ఆదివారం తన సోదరి అదృశ్యమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శృతి ఇచ్చిన […]

Update: 2021-07-18 10:26 GMT

దిశ, కూకట్‌పల్లి : నా వల్ల మీ మరిది చాలా సఫర్ అవుతున్నారు. చేయని తప్పుకు బాధ భరించలేను అంటూ.. ఓ గృహిణి సూసైడ్ నోట్ రాసి తన కన్న కూతురు చేతిలో పెట్టి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది.

ఈ ఘటనపై సీఐ వహీదుద్దిన్ ​తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ బాల్​రెడ్డి నగర్‌కు చెందిన శృతి ఆదివారం తన సోదరి అదృశ్యమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శృతి ఇచ్చిన ఫిర్యాదులో ఆదివారం ఉదయం తన సోదరి షాలిని కూతురు అనన్య(8)కు లెటర్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ లేటర్‌లో తను చేయని తప్పకు బాధ భరించలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంది. ఇలా తన కూతురిని తమ ఇంటి వద్ద దించి.. షాలిని ఆటోలో వెళ్లి పోయిందని శృతి బాలానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, షాలిని భర్త శంకర్, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొత్తగూడెంలో నివాసం ఉంటుంది. షాలిని భర్త కొత్తగూడెంలో జువెల్లరీ షాప్​ నిర్వహిస్తుంటాడు. షాలినికి ఇద్దరు కూతుళ్లూ. తన చిన్న కూతురు అనన్యను తీసుకుని కొత్తగూడెం నుంచి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు వచ్చిన షాలిని.. బాల్​రెడ్డి నగర్‌లోని తన సోదరి శృతి ఇంటికి వచ్చి.. అక్కడ తన కూతురు అనన్యను దింపి.. అనన్య చేతిలో సూసైడ్ లెటర్ పెట్టి అక్కడి నుంచి వెళ్లి పోయింది. దీంతో, భయాందోళనకు గురైన శృతి కుటుంబ సభ్యులు షాలిని కోసం చుట్టు పక్కల గాలించి, పోలీసులను ఆశ్రయించారు.

ఇదిలా ఉండగా తను వెళ్లిన పోయిన కొద్ది సమయానికి భర్త శంకర్‌కు ఫోన్ చేసి.. తనకు బతుకు మీద ఆశ లేదని చెప్పినట్టు శృతి పోలీసులకు తెలిపారు. కేసు నమెదు చేసుకున్న బాలానగర్​పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా షాలిని ఆచూకి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు.

Tags:    

Similar News