కోమా నేర్పిన కొత్త భాష.. డాక్టర్లకే షాక్ ఇస్తున్న లేడీ
దిశ, ఫీచర్స్ : కారు ప్రమాదంలో గాయపడి రెండు వారాలు కోమాలో గడిపిన యూఎస్ మహిళ.. కంప్లీట్ న్యూ యాక్సెంట్‌తో మేల్కొంది. అంతేకాదు రికవరీ ప్రాసెస్‌లో అనేక యాక్సెంట్స్‌లో మాట్లాడిన సదరు లేడీ.. ప్రస్తుతానికి న్యూజిలాండ్ యాసలో మాట్లాడుతూ డాక్లర్లను ఆశ్చర్యపరుస్తోంది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన సమ్మర్ డయాజ్ అనే 24 ఏళ్ల మహిళ.. గతేడాది నవంబర్‌లో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. భుజం విరిగిపోవడంతో పాటు […]
దిశ, ఫీచర్స్ : కారు ప్రమాదంలో గాయపడి రెండు వారాలు కోమాలో గడిపిన యూఎస్ మహిళ.. కంప్లీట్ న్యూ యాక్సెంట్‌తో మేల్కొంది. అంతేకాదు రికవరీ ప్రాసెస్‌లో అనేక యాక్సెంట్స్‌లో మాట్లాడిన సదరు లేడీ.. ప్రస్తుతానికి న్యూజిలాండ్ యాసలో మాట్లాడుతూ డాక్లర్లను ఆశ్చర్యపరుస్తోంది.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన సమ్మర్ డయాజ్ అనే 24 ఏళ్ల మహిళ.. గతేడాది నవంబర్‌లో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. భుజం విరిగిపోవడంతో పాటు మెదడు, ప్రైవేట్ పార్ట్స్‌కు గాయమైంది. ఈ క్రమంలో రెండు వారాలపాటు కోమాలో గడిపిన తనకు ఆ రోజు ఏం జరిగిందో గుర్తులేదు. మేల్కొన్న తర్వాత మొదటల్లో గందరగోళంగా కనిపించిన డయాజ్ అస్సలు మాట్లాడలేకపోయింది. అంతకుముందు ఆమె యూనివర్సిటీలో నేర్చుకున్న సంకేత భాష ద్వారానే కమ్యూనికేట్ అయింది. కొన్ని రోజులకు వాయిస్ తిరిగొచ్చినప్పటికీ, ఆమె ప్రసంగం భిన్నంగా ఉన్నట్లు గమనించింది. దీంతో స్పీచ్ థెరపీకి వెళ్ళిన తను క్రమంగా గొంతు మరింత మారుతున్నట్లుగా భావించింది.
‘రిహాబిలిటేషన్‌కు వెళ్లాక ఆమె వాయిస్ కొంచెం మెరుగైంది. ఆ టైమ్‌లో స్పీచ్ థెరపిస్ట్‌ల సాయంతో ప్రాక్టీస్ చేసినా, చాలా నెమ్మదిగా మాట్లాడుతుండటంతో ఎవరికైనా వినడం కష్టమయ్యేది. క్రమంగా గొంతు బలంగా వినిపించగలిగినా చాలా మంది తన యాస మారినట్లు గుర్తించి, ఏదేశమనే ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.
అయితే ఆమెకు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనే అరుదైన పరిస్థితి ఉందని మొదటిసారిగా ఓ నర్సు కనుగొంది. అప్పటి నుంచి డయాజ్ అనేక యాక్సెంట్స్ మాట్లాడుతుండగా.. అందులో కొన్ని గంటల వరకు, మరికొన్ని నెలల పాటు కొనసాగేవి. కాగా తన బాయ్‌ఫ్రెండ్ బ్రిటిషర్ కావడంతో ఆ యాస వచ్చిందని డయాజ్ తెలిపింది. ఒక దశలో ఫ్రెంచ్, మరొక దశలో రష్యన్‌ను వినేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ లేదా న్యూజిలాండ్ యాసలో స్థిరపడింది.