67 రకాల వంటలతో కొత్తల్లుడికి భోజనం
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కి అల్లుడవడం వరం.. అందులోనూ ఉభయగోదావరి జిల్లాలకు అల్లుడవ్వడమంటే ఎన్నోజన్మల పుణ్యఫలం అనే లోకోక్తి ఏపీలో ఉంది. ఉభయగోదావరి జిల్లాలకు ఎందుకా పేరు వచ్చిందంటే.. కొత్త అల్లుడిపై ఆ రెండు జిల్లాల వాసులు చూపే వాత్సల్యం అలాంటిది మరి. దానికి నిదర్శనంగా అనంత్ రూపనగుడి అనే ట్విట్టర్ యూజర్ కొత్తల్లుడికి ఏపీ మహిళ చేసిన వంటకాలంటూ ఒక వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కి అల్లుడవడం వరం.. అందులోనూ ఉభయగోదావరి జిల్లాలకు అల్లుడవ్వడమంటే ఎన్నోజన్మల పుణ్యఫలం అనే లోకోక్తి ఏపీలో ఉంది. ఉభయగోదావరి జిల్లాలకు ఎందుకా పేరు వచ్చిందంటే.. కొత్త అల్లుడిపై ఆ రెండు జిల్లాల వాసులు చూపే వాత్సల్యం అలాంటిది మరి. దానికి నిదర్శనంగా అనంత్ రూపనగుడి అనే ట్విట్టర్ యూజర్ కొత్తల్లుడికి ఏపీ మహిళ చేసిన వంటకాలంటూ ఒక వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆషాడం పూర్తయిన నేపథ్యంలో కుమార్తె కోసం ఇంటికి వస్తున్న అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలతో భోజనం సిద్దం చేసింది. ఈ 5 కోర్స్ మీల్స్ మెనూ అరిటాకును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. 67 రకాల వంటకాలను వివరిస్తూ చిత్రీకరించిన వీడియో చూస్తే నోట్లో నీళ్లూరాల్సిందే. వెల్కమ్ డ్రింక్, చాట్స్, వివిధ రకాల భిన్నమైన స్వీట్స్, మెయిన్ కోర్స్, స్నాక్స్, డెసర్ట్ ఇలా మొత్తం ఓ హోటల్ మెనూనే ఉందక్కడ. దీనిని చూసిన నెటిజన్లు వెంటనే ఆ మీల్స్ తమకు కూడా పంపాలని కోరుతున్నారు.
This lady has prepared a 67-item Andhra five-course lunch for her visiting son-in-law, consisting of a welcome drink, starters, chaat, main course and desserts! Wow! #banquet pic.twitter.com/Li9B4iNFvc
— Ananth Rupanagudi (@rananth) July 8, 2020