మంత్రి హరీశ్‌రావు పర్యటనలో మహిళ ఆత్మహత్యాయత్నం

దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పట్టణంలో ఎనిమిదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాలకు ఉచితంగా ఇంటి స్థలాలు అందజేసింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ సర్కారు ఇంటి స్థలాలు రద్దు చేయడంతో.. ఆ ప్రభావం వేలాది కుటుంబాలపై పడింది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఇంటి స్థలం కొనడం పేద వర్గాలకు […]

Update: 2021-07-06 11:00 GMT

దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పట్టణంలో ఎనిమిదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాలకు ఉచితంగా ఇంటి స్థలాలు అందజేసింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ సర్కారు ఇంటి స్థలాలు రద్దు చేయడంతో.. ఆ ప్రభావం వేలాది కుటుంబాలపై పడింది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఇంటి స్థలం కొనడం పేద వర్గాలకు గగనంగా మారింది. రద్దు చేసిన ఇంటి స్థలాల పట్టాలు వారిని వెక్కిరిస్తూ ఉండడంతో.. ఎక్కడ సమావేశాలు జరిగినా ఇళ్ల పట్టాలు పొందిన వారి నిరసనలు కొనసాగుతుంటాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం సదాశివపేట పట్టణంలో రూ.5 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ ను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు ఆ సెగ తగిలింది. ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరేందుకు మంత్రి సభకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరసనలు చేస్తూ చెరువుకు రక్షణగా ఏర్పాటు చేసిన భారీ కేడ్ పైకి ఎక్కి చెరువులో దూకేందుకు సిద్ధపడింది. అది గమనించిన మహిళా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను నిలువరించారు. ఆ మహిళ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలు రద్దు చేశారని తీవ్రంగా మండిపడింది. ఈ ఆత్మహత్యాయత్నం స్థానికంగా సంచలనం సృష్టించింది. చివరికి పోలీసులు, స్థానికంగా వివిధ శాఖల అధికారులు ఆమెకు నచ్చజెప్పడంతో ఆ మహిళ తన సమస్యను విన్నవించుకునేందుకు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.

Tags:    

Similar News