టిక్ టాకర్‌ పంట పండించిన కిరాణా షాప్ డైరీ!

దిశ, ఫీచర్స్: ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు.. కొందరికి మంచి ఫుడ్ తినాలనే పిచ్చి ఉంటే.. మరికొందరికి మాల్స్‌కు వెళ్లి ట్రెండ్‌కు తగినట్లు డ్రెస్‌లు కొనుక్కుని ఎంజాయ్ చేసే మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఇంకొందరు సాయంత్రం కాగానే స్పెన్సర్స్, డీమార్ట్ లాంటి స్టోర్స్‌కు వెళ్లి సరుకులు, కూరగాయలు కొనడాన్ని ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఇంట్రెస్ట్ యూఎస్‌కు చెందిన ఓ టిక్‌టాకర్‌ను పాపులర్ చేసింది. థ్రిఫ్ట్ స్టోర్‌కు వెళ్లిన టిక్ టాకర్‌ ఎప్పటిలాగే సరుకులు సెలెక్ట్ చేసుకుంటుండగా.. 1957కు చెందిన […]

Update: 2021-04-01 03:41 GMT

దిశ, ఫీచర్స్: ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు.. కొందరికి మంచి ఫుడ్ తినాలనే పిచ్చి ఉంటే.. మరికొందరికి మాల్స్‌కు వెళ్లి ట్రెండ్‌కు తగినట్లు డ్రెస్‌లు కొనుక్కుని ఎంజాయ్ చేసే మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఇంకొందరు సాయంత్రం కాగానే స్పెన్సర్స్, డీమార్ట్ లాంటి స్టోర్స్‌కు వెళ్లి సరుకులు, కూరగాయలు కొనడాన్ని ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఇంట్రెస్ట్ యూఎస్‌కు చెందిన ఓ టిక్‌టాకర్‌ను పాపులర్ చేసింది. థ్రిఫ్ట్ స్టోర్‌కు వెళ్లిన టిక్ టాకర్‌ ఎప్పటిలాగే సరుకులు సెలెక్ట్ చేసుకుంటుండగా.. 1957కు చెందిన ఒక డైరీ తన కంటపడింది. అది అక్కడకు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఈ డైరీ మాత్రం టిక్ టాకర్‌కు వరల్డ్ వైడ్‌గా బోలెడు మంది ఫాలోవర్స్‌ను తెచ్చిపెట్టింది.

సౌత్ సెంట్రల్ యూఎస్‌లోని ఒఖ్లామాకు చెందిన నెల్లీ అనే హౌస్ వైఫ్.. 1957లో రాసుకున్న డైరీలో ఏముందో తెలుసా? అంటూ తన టిక్‌టాక్ ఫాలోవర్స్‌లో ఆసక్తి రేకెత్తించాడు. ‘అదర్ వరల్డ్ డిజైన్’ అనేది తన టిక్ టాక్ ఎకౌంట్ నేమ్ కాగా.. ఫాలోవర్స్ అటెన్షన్ పెంచేందుకు డైరీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. 1957లో హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మీరు రెడీనా? అంటూ ఎగ్జైట్‌మెంట్ పెంచాడు. ఇలా వారం రోజులకు ఒకసారి లేదా పదిహేను రోజులకోసారి ఆ డైరీ నుంచి ఒక్కో పేజ్ పోస్ట్ చేయడం ప్రారంభించారు. అది షార్ట్ డైరీ కావడంతో ఆమె కేవలం కొన్ని పదాలతోనే రోజంతా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాసుకోవడం.. అది ఫాలోవర్స్‌కు కూడా నచ్చడం.. ఆ స్క్రీన్ షాట్స్‌ను తమ టిక్ టాక్ పేజీల్లో షేర్ చేయడంతో ‘అదర్ వరల్డ్ డిజైన్’ టిక్ టాక్ చానల్ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ చానల్‌లో ఇప్పటి వరకు డైరీకి సంబంధించిన కేవలం పది వీడియోలు మాత్రమే షేర్ చేయగా.. 8.2 మిలియన్ కలెక్టివ్ వ్యూస్, 1.2 మిలియన్ లైక్స్, 2 లక్షల వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.

ఇంతకీ ఆ పది వీడియోస్‌లో టిక్ టాకర్ ఏం షేర్ చేశాడో తెలుసా? ‘రోజంతా ఏమీ చేయలేదు కానీ బాగా తిన్నాను’, ‘విన్నీ నన్ను డిన్నర్‌కు పిలిచింది కానీ ఇంట్రెస్ట్ లేక వెళ్లలేదు’, ‘ఈ రోజు చేయాల్సిందేమీ లేదు బల్లి కోసం కొన్ని ఈగలు పట్టాను, కొంత ప్యాచ్ వర్క్ చేశా’, ‘ఈ రోజు కలర్‌ఫుల్ వెడ్డింగ్.. అన్నింటి మాదిరిగానే బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యాటెన్, అమెలియా జాక్సన్ సింగర్స్’, ‘అడవుల్లో స్వారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు నక్కను చూసి ఎలా భయపడ్డారు’ అనేది వివరించింది. ఇక నెల్లీ న్యూ మెక్సికో ట్రిప్‌లో అప్పటి కాఫీ ధర 31 సెంట్స్( ప్రస్తుతం.. 2.90 డాలర్స్), భోజనం కేవలం 55 సెంట్స్‌(ప్రస్తుతం.. 5.15 డాలర్స్)కు మాత్రమే లభించేదని తెలుస్తోంది. సేఫ్ వే, టి.జి. ఎఫ్‌వైఐ లాంటి రిటైలర్స్ గురించి కూడా ఈ డైరీలో ఉండగా.. సూపర్ మార్కెట్ కంపెనీ ‘సేఫ్ వే’ ఇప్పటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. కాగా అప్పట్లో ఒఖ్లామాలో ఉన్న వెరైటీ స్టోర్ టీజీ 2001లోనే మూతపడింది.

Tags:    

Similar News