డిసెంబర్‌లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: వచ్చే నెల 21 నుంచి రెండు వారాలపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర సర్కారు యోచిస్తున్నది. డిసెంబర్ 21న మొదలై జనవరి 2వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. జనవరి 30న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా నవంబర్ మూడో వారంలో శీతాకాల సమావేశాలుంటాయి. కేంద్రం వీటిని మరో నెల పొడిగించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమావేశాల నిర్వహణపై […]

Update: 2020-11-03 05:07 GMT

న్యూఢిల్లీ: వచ్చే నెల 21 నుంచి రెండు వారాలపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర సర్కారు యోచిస్తున్నది. డిసెంబర్ 21న మొదలై జనవరి 2వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. జనవరి 30న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా నవంబర్ మూడో వారంలో శీతాకాల సమావేశాలుంటాయి. కేంద్రం వీటిని మరో నెల పొడిగించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.

అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమావేశాల నిర్వహణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. శాసనపరమైన ఎజెండాతో ఈ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నది. గతేడాది కూడా శీతాకాల సమావేశాలు డిసెంబర్‌‌లో మొదలై జనవరిలో ముగిసిన విషయం తెలిసిందే. 23 రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వర్షాకాలు సమావేశాలు నిర్దేశించుకున్న గడువుకు ముందే కరోనా కేసుల కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టాలనుకున్న బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో శాసనపరమైన ఎజెండాతో వచ్చే నెలలో శీతాకాల సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది.

Tags:    

Similar News