Helicopter Crash.. మృత్యువుతో పోరాడుతున్న జవాన్ ఎక్కడున్నాడంటే..?

దిశ, వెబ్ డెస్క్: కోయంబత్తూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ వరుణ్ సింగ్  మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సేవలకోసం వెల్లింగ్టన్ నుంచి ప్రత్యేక వాహనంలో బెంగళూరుకు తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యావేక్షణలో కమాండర్ ను తరలించినట్టు సమాచారం. ఇక ప్రమాదంలో మరణించిన వారిని ఢిల్లీకి తరలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ […]

Update: 2021-12-09 07:19 GMT

దిశ, వెబ్ డెస్క్: కోయంబత్తూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సేవలకోసం వెల్లింగ్టన్ నుంచి ప్రత్యేక వాహనంలో బెంగళూరుకు తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యావేక్షణలో కమాండర్ ను తరలించినట్టు సమాచారం.

ఇక ప్రమాదంలో మరణించిన వారిని ఢిల్లీకి తరలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బిపిన్ రావత్ తో సహా మిగతా 13 మంది భౌతికాయాలను తరలిస్తారు. ప్రధాని మంత్రి మోది, రాజ్ నాథ్ సింగ్ లు పాలెం ఎయిర్ బేస్ లో పార్ధివ దేహాలకు నివాళులు అర్పిస్తారు.

Tags:    

Similar News