వేనేపల్లి దారెటు..? ఎమ్మెల్సీ పదవి దక్కేనా?

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది కోదాడ నియోజకవర్గం. పేరుకు అది తెలంగాణ ప్రాంతం. కానీ అక్కడంతా ఆంధ్రా కల్చర్ ఎక్కువగా కన్పిస్తుంది. భాష, యాస తీరు ఆంధ్రానే పోలి ఉంటుంది. దీనికి తోడు ఆ నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కోదాడ నియోజకవర్గంపై తన ముద్రను చిరస్థాయిలో నిలిచేలా చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావం ఎక్కువగానే కన్పించేది. ఒకటి కాదు […]

Update: 2021-06-29 23:22 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది కోదాడ నియోజకవర్గం. పేరుకు అది తెలంగాణ ప్రాంతం. కానీ అక్కడంతా ఆంధ్రా కల్చర్ ఎక్కువగా కన్పిస్తుంది. భాష, యాస తీరు ఆంధ్రానే పోలి ఉంటుంది. దీనికి తోడు ఆ నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కోదాడ నియోజకవర్గంపై తన ముద్రను చిరస్థాయిలో నిలిచేలా చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావం ఎక్కువగానే కన్పించేది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఏకచక్రాధిపత్యం.. ముఖ్యమంత్రిని సైతం నేరుగా కలవగలిగే చొరవ.. కానీ ఇదంతా గతం.. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు.

వేనేపల్లి రాజకీయమంతా ఘనమే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయవర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి వేనేపల్లి చందర్‌రావు. 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టిన వేనేపల్లి.. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో మరోసారి టీడీపీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో తుమ్మల నాగేశ్వరరావుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన ద్వారా వేనేపల్లి చందర్‌రావు టీఆర్ఎస్‌లో చేరారు. వాస్తవానికి 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి టీఆర్ఎస్ తరఫున చందర్ రావు పోటీ చేస్తారని అందరూ భావించారు. టీడీపీ, కాంగ్రెస్ కూటమి తరఫున బొల్లం మల్లయ్యయాదవ్ పోటీలో ఉంటారనుకున్నారు.. కానీ, అనూహ్యంగా కూటమి తరఫున మల్లయ్య యాదవ్‌కు అవకాశం రాకపోవడంతో.. చివరి నిమిషంలో టీఆర్ఎస్‌లో చేరి సీటు దక్కించుకుని విజయం సాధించారు.

ఎమ్మెల్సీ పదవిపైనే ఆశలన్నీ..

వేనేపల్లి చందర్‌రావు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ సైతం ఒకానొకదశలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అనుహ్యంగా బొల్లం మల్లయ్యయాదవ్ టీఆర్‌ఎస్‌లోకి రావడం, ఆయనకే టికెట్ ఇవ్వడంతో వేనేపల్లి చందర్‌రావు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వేనేపల్లికి సీఎం కేసీఆర్ మొదట్నుంచి ఎమ్మెల్యే పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. కానీ 2014 నుంచి ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో ఆయన వర్గీయులు సైతం అసంతృప్తితో ఉన్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా అవకాశం ఇస్తారని వేనేపల్లి సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితులు కానరావడం లేదు. ఈసారి వేనేపల్లికి ఎమ్మెల్సీ పదవి అవకాశం రాకపోతే.. ఆయన ఇక రాజకీయాల్లో నుంచి కనుమరుగు అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొరవతో వేనేపల్లి టీఆర్ఎస్‌లో చేరారు. కానీ ప్రస్తుతం తుమ్మల సైతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుండడంతో వేనేపల్లి వర్గీయులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

Tags:    

Similar News