ఆమెకు మేయర్ పదవి దక్కేనా..?
దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆమె ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా 2500పై చిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఆమె రెండోసారి గెలిచింది. దీంతో ఆమె మేజర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు […]
దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆమె ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా 2500పై చిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఆమె రెండోసారి గెలిచింది. దీంతో ఆమె మేజర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. మేయర్ పదవి కోసం పటాన్ చెరువు నుంచి గెలిచిన సింధూరెడ్డి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, చింతల విజయశాంతి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమని శ్రీదేవితోపాటు ఎంపీ కేశవరావు కూతురు పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్వాల్క్ చెందిన విజయశాంతి కూడా రేసులోనే ఉన్నట్టు ఆమె చేస్తున్న ప్రయత్నాలను బట్టి అర్ధమవుతోంది.
ఇద్దరు మంత్రుల మద్దతు..
కాగా, మేయర్ పదవిని దక్కించుకునేందుకు విజయశాంతికి పలు అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి తన మామ, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద క్లీన్ చీట్ ఉండడం, మంత్రి మల్లారెడ్డి, ఈటల రాజేందర్ విజయశాంతికి అనుకూలంగా వ్యవహరించడం కాగా, మూడో అంశం విజయశాంతి ఇక్కడి నుంచి రెండోసారి గెలిచిన అనుభవం ఆమెకు అనుకూలంచే అంశాలు. అంతేగాక, విజయశాంతి మొదటి నుంచి టీఆర్ఎస్ తోనే ఉండడం మరో సానుకూల అంశం. దీంతో మేయర్ పదవిని ఆశీస్తున్న ఇతర కార్పొరేటర్లతో పోల్చుకుంటే, అన్ని అంశాలు విజయశాంతికే అనుకూలంగా ఉన్నట్టు టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే అభిప్రాయం ప్రధానమే…
అయితే, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే హనుమంతరావు సహకారం కూడా అవసరమని, వారిచ్చే మద్దతుపైనే అల్వాల్ కు మేయర్ పదవి దక్కే విషయం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈసారి విజయశాంతి గెలుపునకు ఎమ్మెల్యే హనుమంతరావు సంపూర్ణ సహకారం అందించడమే గాకుండా, అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకులు, కార్యకర్తలందరినీ ఐక్యం చేసి ఆమె గెలుపునకు కృషి చేశారు. అయితే, విజయశాంతిని మేయర్ పదవికి బలపరిచే విషయంలో ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉంటుందన్నది అందరినీ ఆలోచింపజేస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరిలోని 9డివిజన్లకు తొమ్మిదిందిటినీ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హనుమంతరావు 6డివిజన్లను మాత్రమే గెలుచుకుని బలహీనపడిన నేపథ్యంలో అల్వాల్ కు మేయర్ పదవిని తెచ్చుకుని పరపతిని పెంచుకుంటారా..? లేదా..? అన్నది చర్చానీయంగా మారింది. ఇదిలా ఉండగా మేయర్ పదవికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉన్నా లేకున్నా, పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని టీఆర్ఎస్ నాయకుల ఆలోచన. అయితే, చివరికి ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.