చైనాకు మరో షాక్ ఇచ్చిన భారత్

న్యూఢిల్లీ: లడాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనాపై భారత్ పరోక్ష యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలే చైనాకు చెందిన 59 అప్లికేషన్‌లపై నిషేధాన్ని విధించగా, తాజాగా రోడ్డు ప్రాజెక్టుల్లో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో డ్రాగన్ దేశ పెట్టుబడులను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. హైవే ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను అనుమతించబోమని, ఒకవేళ జాయింట్ వెంచర్ రూపంలో భారత్‌లోకి ప్రవేశించాలని యోచించినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు మార్చి భారత కంపెనీలు […]

Update: 2020-07-01 06:19 GMT

న్యూఢిల్లీ: లడాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనాపై భారత్ పరోక్ష యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలే చైనాకు చెందిన 59 అప్లికేషన్‌లపై నిషేధాన్ని విధించగా, తాజాగా రోడ్డు ప్రాజెక్టుల్లో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో డ్రాగన్ దేశ పెట్టుబడులను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. హైవే ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను అనుమతించబోమని, ఒకవేళ జాయింట్ వెంచర్ రూపంలో భారత్‌లోకి ప్రవేశించాలని యోచించినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు మార్చి భారత కంపెనీలు చైనా సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటుచేసుకోకుండా చెక్ పెడతామని చెప్పారు. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టిన చైనా సంస్థలపై ఈ నిర్ణయాల ప్రభావం ఉండబోదని, భవిష్యత్తులో వచ్చే లేదా ఇప్పుడు బిడ్‌ల దశలో ఉన్న ప్రాజెక్టుల్లోకీ ఆ దేశ పెట్టుబడులను రానివ్వమని వివరించారు. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెబుతూనే చైనా పెట్టుబడులను తిరస్కరిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలను అమలు చేయడానికి విధి విధానాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపారు.

Tags:    

Similar News