బెంగాల్‌ను మరో గుజరాత్ కానివ్వం : దీదీ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ను మరో గుజరాత్‌గా మారనివ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కొందరు ‘గుజరాతీలు’ యూపీ, బీహార్‌ల నుంచి గూండాలను బెంగాల్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాము బెంగాల్‌ను మరో గుజరాత్‌లా మారనివ్వబోమని వివరించారు. పశ్చిమ బెంగాల్ మూడో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ ఆదివారం హౌరాలో మాట్లాడారు. రైతులకు డబ్బులివ్వడంపై వాళ్లు పెద్ద పెద్ద డైలాగ్‌లు ఇస్తున్నారని […]
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ను మరో గుజరాత్‌గా మారనివ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కొందరు ‘గుజరాతీలు’ యూపీ, బీహార్‌ల నుంచి గూండాలను బెంగాల్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాము బెంగాల్‌ను మరో గుజరాత్‌లా మారనివ్వబోమని వివరించారు.
పశ్చిమ బెంగాల్ మూడో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ ఆదివారం హౌరాలో మాట్లాడారు. రైతులకు డబ్బులివ్వడంపై వాళ్లు పెద్ద పెద్ద డైలాగ్‌లు ఇస్తున్నారని తెలిపారు, అర్హులైన రైతుల జాబితాను తాము కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, మరి వారెందుకు డబ్బులు పంపించడం లేదని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీతో దాడులకు పాల్పడుతున్నారని, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఆరోపణలు చేశారు. సిండికేట్ నెంబర్ వన్ మోడీ, సిండికేట్ నెంబర్ టూ అమిత్ షా అని విమర్శించారు. వీరిద్దరే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను అభిషేక్ బెనర్జీ, సుదీప్ నివాసం అలాగే, డీఎంకే చీఫ్ స్టాలిన్ కూతురి ఇంటిపై దాడికి పంపిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు వారు పోలీసు అధికారులను మారుస్తున్నారని వివరించారు.