ఎయిమ్స్‌ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దుతా : కోమటిరెడ్డి

దిశ,భువనగిరి రూరల్: ఎయిమ్స్‌ను దేశంలోనే నెంబ‌ర్ వన్ ఆస్ప‌త్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్సుక్ మండ‌వియాతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బీబీనగ‌ర్ ఎయిమ్స్‌లో వ‌స‌తుల కల్పనపై చర్చించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తాను అడ‌గ‌గానే ఎయిమ్స్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచినందుకు కేంద్ర మంత్రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అభివృద్ధికి […]

Update: 2021-09-28 07:55 GMT

దిశ,భువనగిరి రూరల్: ఎయిమ్స్‌ను దేశంలోనే నెంబ‌ర్ వన్ ఆస్ప‌త్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్సుక్ మండ‌వియాతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బీబీనగ‌ర్ ఎయిమ్స్‌లో వ‌స‌తుల కల్పనపై చర్చించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తాను అడ‌గ‌గానే ఎయిమ్స్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచినందుకు కేంద్ర మంత్రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న‌ ఎయిమ్స్ పై చాలా సార్లు కేంద్ర మంత్రి, ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి విన్న‌వించానని గుర్తు చేశారు. ఇటీవల నూతనంగా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనసుఖ్ మండవియాని కలిసి బీబీనగర్ ఎయిమ్స్ పరిస్థితి వివరించినట్లు తెలిపారు.

తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ.776.13 కోట్లు ఎయిమ్స్‌లో భ‌వ‌నాల‌ నిర్మాణానికి కేటాయించారు. అలాగే మరో 23.50 కోట్లు ఎయిమ్స్ నిర్వహణ కొరకు మంజూరు చేశారు. మరో నెల రోజుల్లో 3వ బ్యాచ్ విద్యార్థులు చేరనున్న నేపథ్యంలో వారి కోసం ఎయిమ్స్ బీబీనగర్‌లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రిని కోరారు. లేదంటే విద్యార్థుల చ‌దువుకు చాలా ఆటంకాలు, ఇబ్బందులు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని వివ‌రించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఎయిమ్స్ బీబీనగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే అభివృద్ధికి ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయని ఎంపీకి తెలిపారు.

Tags:    

Similar News