ఒక్క ఇంచు కూడా వదులుకోము.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గూవహాటి : మా రాష్ట్రం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా పక్క రాష్ట్రాలకు వదులుకోమని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ఉద్ఘాటించారు. ఈ విషయంపై మంగళవారం సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నామని తెలిపారు. మా భాభాగం విషయంలో ఇతర రాష్ట్రాలతో ఎటువంటి సెటిల్‌మెంట్లకు అంగీకరించేదని లేదని తేల్చేశారు. తమను చర్చల కోసం మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్ తంగా ఐజ్వాల్‌కు ఆహ్వానించారని అన్నారు. అయితే అస్సాం పోలీసులకు, ఐజ్వాల్ పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. తమ […]
గూవహాటి : మా రాష్ట్రం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా పక్క రాష్ట్రాలకు వదులుకోమని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ఉద్ఘాటించారు. ఈ విషయంపై మంగళవారం సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నామని తెలిపారు. మా భాభాగం విషయంలో ఇతర రాష్ట్రాలతో ఎటువంటి సెటిల్‌మెంట్లకు అంగీకరించేదని లేదని తేల్చేశారు.
తమను చర్చల కోసం మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్ తంగా ఐజ్వాల్‌కు ఆహ్వానించారని అన్నారు. అయితే అస్సాం పోలీసులకు, ఐజ్వాల్ పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. తమ పోలీసులపై ఇతర రాష్ట్రాలు చేసే విచారణకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అలాగే తనను అరెస్ట్ చేస్తే మిజోరాం, అస్సాం సరిహద్దు సమస్య పరిష్కారం అవుతుందంటే.. అలాగే చేయాలని అన్నారు.
తనకు కనుక మిజోరాం పోలీసులు నోటీస్ ఇస్తే బెయిల్ కోసం హైకోర్ట్‌కు కూడా వెళ్లనని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ప్రస్తుత వివాదాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ లేదా మరేదైనా కేంద్ర సంస్థ కానీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మిజోరాం, అస్సాం సరిహద్దులో జరిగిన ఘర్షణలపై ఐజ్వాల్ పోలీసులు నలుగురు డిస్పూర్ పోలీసులు సహ మరో ఇద్దరు అధికారులపై హత్యాయత్న నేరం, ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటంపై ఆయన ఈ విధంగా స్పందించారు.