వాళ్లతో పడుకోమని ఇబ్బంది పెడుతున్నాడు.. అందుకే నా భర్తను చంపేశా

దిశ, వెబ్ డెస్క్: భర్తను భార్య చంపేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే నేత్రకు పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (50)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలార్ స్వామికి ఇదివరకే పెళ్లయ్యింది. బ్యూటీపార్లర్‌ నడుపుతున్న నేత్రకు హారో క్యాతనహళ్లి వద్ద రూ. 6 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. అయితే, ఆదివారం రాత్రి నేత్ర మాదనాయకనహళ్లి […]

Update: 2021-11-09 22:06 GMT

దిశ, వెబ్ డెస్క్: భర్తను భార్య చంపేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే నేత్రకు పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (50)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలార్ స్వామికి ఇదివరకే పెళ్లయ్యింది. బ్యూటీపార్లర్‌ నడుపుతున్న నేత్రకు హారో క్యాతనహళ్లి వద్ద రూ. 6 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. అయితే, ఆదివారం రాత్రి నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. తన భర్త పరాయి వ్యక్తుల వద్దకు వెళ్లాలని తనని ఇబ్బంది పెడుతున్నాడని, ఈ నేపథ్యంలోనే తన భర్తను చంపేసినట్లు నేత్ర తెలిపింది. తనని, తన పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే తన భర్తను హత్య చేసిందని రెండో భార్య నేత్రపై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News