భర్త రోజూ ఆ పని చేస్తున్నాడని.. మర్మాంగంపై తన్ని..

దిశ, ఏపీ బ్యూరో: దంపతుల మధ్య మద్యం చిచ్చు పెట్టింది. ఫుల్‌గా తాగొచ్చిన భర్త భార్యను రోజూ కొడుతూ ఉండేవాడు. అంతేకాదు అందరూ వినేలా దుర్భాషలాడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేని ఆ ఇల్లాలు అతడిని హత్య చేసింది. అయితే ప్రమాదవశాత్తు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు తేలడంతో పోలీసులు తమదైన శైలిలో భార్యను విచారించారు. భర్త వేధింపులు తాళలేక తానే హత్య చేసినట్లు అంగీకరించింది. మూడు నెలల తర్వాత ఈ […]

Update: 2021-08-11 09:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: దంపతుల మధ్య మద్యం చిచ్చు పెట్టింది. ఫుల్‌గా తాగొచ్చిన భర్త భార్యను రోజూ కొడుతూ ఉండేవాడు. అంతేకాదు అందరూ వినేలా దుర్భాషలాడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేని ఆ ఇల్లాలు అతడిని హత్య చేసింది. అయితే ప్రమాదవశాత్తు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు తేలడంతో పోలీసులు తమదైన శైలిలో భార్యను విచారించారు. భర్త వేధింపులు తాళలేక తానే హత్య చేసినట్లు అంగీకరించింది. మూడు నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు.

వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కేశవ, రేఖ దంపతులు. పలమనేరు టమాటా మార్కెట్లో కేశవ హమాలిగా పనిచేసేవాడు. అయితే మద్యానికి బానిసైన కేశవ నిత్యం తాగుతూ ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 23న మేడపై భార్యభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. కోపంతో కేశవ భార్య రేఖను చావబాదాడు. అతడి దెబ్బలు భరించలేకపోయిన రేఖ కోపోద్రిక్తురాలైంది. ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. ఆవేశంలో పలుమార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. అయితే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్యకు గురయ్యాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు తేలింది. నేరం అంగీకరించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.

Tags:    

Similar News