మామతో అక్రమ సంబంధం.. విషయం తెలిసిన భర్తను…

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తనే ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. వరుసకు మామ అయ్యే వ్యక్తితో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి.. చివరకు భర్తనే అడ్డుతొలగించుకుంది. వివరాల ప్రకారం.. కర్నాకటలోని టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గత నెల 20న రాత్రి కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మైకేల్‌ జాన్‌(40) అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. రైల్వే ట్రాక్‌ వద్ద […]

Update: 2021-04-06 22:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తనే ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. వరుసకు మామ అయ్యే వ్యక్తితో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి.. చివరకు భర్తనే అడ్డుతొలగించుకుంది.

వివరాల ప్రకారం.. కర్నాకటలోని టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గత నెల 20న రాత్రి కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మైకేల్‌ జాన్‌(40) అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. రైల్వే ట్రాక్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న జాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బండరాయిని తలపై వేసి హత్య చేశారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.నారాయణ ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా, చివరికి ఈ కేసులో మైకేల్‌జాన్‌ భార్య సుర్గుణంను ప్రధాన ముద్దాయిగా పోలీసులు తేల్చారు. ఆమెకు తన బంధువు, వరుసకు మామ అయ్యే వినోద్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉండేది. ఎలాగైనా వినోద్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. మద్యానికి బానిసగా మారి తరచు తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న అతడిని హతమార్చేందుకు ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

Tags:    

Similar News