భర్త మృతదేహం పక్కనే 12 గంటలు ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: అడ్డదారులు తొక్కిన ఓ భార్య.. భర్తను అడ్డంగా నరికి హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉంచి ప్రియుడితో జల్సాలు చేసింది. ‘పని’ ముగిశాక భర్త శవాన్ని అడవిలోకి తీసుకెళ్లి దహనం చేసింది. తర్వాత పిల్లలను తీసుకోని ప్రియుడితో జల్సాలకు వెళ్లింది. అయితే భర్త కనిపించకపోయినా కోడలు పట్టించుకోకపోవడం, ఫోన్ కూడా చేయకపోవడంతో మామకు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కేసు కూపీలాగిన పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: అడ్డదారులు తొక్కిన ఓ భార్య.. భర్తను అడ్డంగా నరికి హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉంచి ప్రియుడితో జల్సాలు చేసింది. ‘పని’ ముగిశాక భర్త శవాన్ని అడవిలోకి తీసుకెళ్లి దహనం చేసింది. తర్వాత పిల్లలను తీసుకోని ప్రియుడితో జల్సాలకు వెళ్లింది. అయితే భర్త కనిపించకపోయినా కోడలు పట్టించుకోకపోవడం, ఫోన్ కూడా చేయకపోవడంతో మామకు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కేసు కూపీలాగిన పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులో జరిగిన ఈ మిస్టరీ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాంచీపురం జిల్లా సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు. గత కొంతకాలం నుంచి విమలరాణి ఓ యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. కొద్దిరోజులు వారి వ్యవహారం గుట్టుగా సాగినా.. ఆ తర్వాత అత్తారింట్లో తెలిసిపోయింది. దీంతో భర్త విమలరాణిని హెచ్చరించాడు. పిల్లలు అయ్యాక ఇలాంటి పాడు పనులు ఎందుకని, కుటుంబం నాశనం అవుతుందని హెచ్చరించాడు. ఇప్పటికైనా మంచిగా మారాలని హితవు పలికాడు. అత్తారింటి వాళ్లు సైతం ఆమెను కౌన్సెలింగ్ ఇచ్చి మంచిగా ఉండాలని సూచించారు. కానీ ఇవేమి పట్టించుకోని విమలరాణి యథావిధిగా ప్రియుడితో జల్సాలు చేసింది. పైగా తన ఆనందానికి అడ్డుతగులుతున్నాడని భర్తను తొలగించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది.
భర్తను హతమర్చేందుకు కుట్ర పన్నిన భార్య.. జులై 28న రాత్రి సమయంలో తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. భర్త నిద్రపోతున్న సమయంలో ఇద్దరు కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బెడ్ రూంలోనే ఉంచి 12 గంటల పాటు ఇద్దరు ఎంజాయ్ చేశారు. తెల్లవారిన తర్వాత ఇద్దరు మృతదేహాన్ని చెంగల్‌పట్టు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఆ తర్వాత జల్సాలు చేయడానికి చెక్కేశారు.
అయితే తన కొడుకు రోజంతా కనిపించకపోవడం, ఫోన్ కూడా పని చేయకపోవడంతో తండ్రి మనసు కీడు శంకించింది. ఇంట్లో కోడలు, పిల్లలు కూడా లేకుండా పోయారు. కోడలు విమలరాణికి ఫోన్ చేసి ఆమె భర్త గురించి వాకాబు చేసినా ఆమె పట్టించుకోలేదు. పైగా భర్తకు ఫోన్ చేయాలని అడిగినా.. ఇప్పడు చేయనని చెప్పేసింది. దీంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విమలరాణిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మొదట తనకేమి తెలియదని బుకాయించినా.. చివరకు ప్రియుడి సహాయంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. కానీ మృతదేహాన్ని చూపిండంలో నాటకాలు ఆడి పోలీసులను సైతం తప్పుదారి పట్టించింది. మొదట సోమమంగళం చెరువులో పడేశానని చెప్పింది. చెరువంతా గాలించినా మృతదేహం ఆచూకీ లభించలేదు. దీంతో మరోసారి స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన రీతిలో విచారించడంతో చెంగల్‌పట్టు అడవిలో మృతదేహానికి నిప్పుపెట్టి దహనం చేసినట్టు తెలిపింది. వెంటనే అక్కడి పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేసిన పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విమలరాణిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నాడు.