భర్త మృతిని తట్టుకోలేని భార్య.. ఇంత పని చేసిందేంటి..?

దిశ, నాగార్జునసాగర్: భర్త ఆత్మహత్యను తట్టుకోలేక భార్య కాలువలో దూకి ప్రాణాలు విడిచిన విషాద ఘటన నాగార్జునసాగర్‌ పరిధి నందికొండ మున్సిపాలిటీలో వెలుగుచూసింది. కరోనా, లాక్‌డౌన్ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీవనం మరీ దయానీయంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో నివాసం ఉంటున్న వెన్నం రవికుమార్ ప్రైవేట్ స్కూల్ టీచర్. కరోనా, లాక్‌డౌన్ అనంతరం తీవ్రంగా ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు […]

Update: 2021-04-08 07:21 GMT

దిశ, నాగార్జునసాగర్: భర్త ఆత్మహత్యను తట్టుకోలేక భార్య కాలువలో దూకి ప్రాణాలు విడిచిన విషాద ఘటన నాగార్జునసాగర్‌ పరిధి నందికొండ మున్సిపాలిటీలో వెలుగుచూసింది. కరోనా, లాక్‌డౌన్ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీవనం మరీ దయానీయంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో నివాసం ఉంటున్న వెన్నం రవికుమార్ ప్రైవేట్ స్కూల్ టీచర్. కరోనా, లాక్‌డౌన్ అనంతరం తీవ్రంగా ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇక కుటుంబాన్ని పోషించలేనిస్థితిలో.. ఎటు దిక్కుతోచక రవికుమార్ మంగళవారం సూసైడ్ చేసుకున్నాడు. ఇక భర్త మరణవార్తను జీర్ణించుకోలేక పోయిన భార్య అక్కమ్మ.. రెండ్రోజుల తర్వాత గురువారం సాగర్‌ కుడి కాలువలోకి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగలడం బాధాకరం.

Tags:    

Similar News