ఆ గర్భం ఎలా వచ్చింది.. మామిడి తోటలో తేల్చేసిన భర్త

దిశ, వెబ్‌డెస్క్: అమ్మ కావడం అనేది ప్రతి మహిళకు ఉండే ఒక గొప్ప వరం.  పిల్లలు లేని మహిళలను సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పిల్లలు కావాలని భార్యాభర్తలు చేయని నోములు, పూజలు ఉండవు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ వరం ఆమెకు దక్కింది. తొమ్మిదేళ్ల తర్వాత తాను తల్లి కాబోతున్నానని తెలిసి ఎంతో సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఆమెకు ఎంతోకాలం నిలువనివ్వలేదు ఆమె భర్త. బంధువులు, స్నేహితుల మాట […]

Update: 2021-05-14 01:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమ్మ కావడం అనేది ప్రతి మహిళకు ఉండే ఒక గొప్ప వరం. పిల్లలు లేని మహిళలను సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పిల్లలు కావాలని భార్యాభర్తలు చేయని నోములు, పూజలు ఉండవు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ వరం ఆమెకు దక్కింది. తొమ్మిదేళ్ల తర్వాత తాను తల్లి కాబోతున్నానని తెలిసి ఎంతో సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఆమెకు ఎంతోకాలం నిలువనివ్వలేదు ఆమె భర్త. బంధువులు, స్నేహితుల మాట విన్నఅతను ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని వేధించడం మొదలుపెట్టాడు. ఆ అనుమానం కాస్త పెనుభూతంలా మారి భార్యను అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం..

నందులూరు మండలం టంగుటూరు హరిజనవాడకు చెందిన నరసయ్య కు, లక్ష్మమ్మ తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమయ్యింది. అప్పటినుండి వారు పిల్లల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, వారికి పిల్లలు కలగలేదు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది. దీంతో ఇన్నేళ్ళుగా లేని గర్భం ఇప్పుడెలా వచ్చింది అంటూ చుట్టుపక్కల వారు నరసయ్యను అడగడం మొదలుపెట్టారు. అది తన వల్ల వచ్చింది కాదని, ఆ బిడ్డకు తండ్రివి నువ్వు కాదని వేధించసాగారు. ఇక ఈ మాటలను నమ్మిన నరసయ్య భార్య లక్షమ్మ పై అనుమానం పెంచుకున్నాడు. రోజూ ఇంటికి వచ్చి ఆ బిడ్డకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరితో వివాహేతర సంబంధం నడుపుతున్నావో చెప్పాలని భార్యను వేధించేవాడు. ఆమె తాను ఏ తప్పు చేయలేదని చెప్తుండడంతో ఎలాగైనా భార్యను అంతమొందించాలనుకున్నాడు.

భార్యతో చనువుగా ఉంటున్నట్లు నటించి ఆమెను మామిడి తోటకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె తలపై కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు ఇంటికి వెళ్లి భార్య కనిపించడం లేదని దొంగ ఏడుపులు ఏడ్చాడు. అల్లుడు ప్రవర్తనపై అనుమానమొచ్చిన లక్ష్మమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మమ్మ మృతదేహాన్ని మామిడి తోటలో గుర్తించారు. ప్రస్తుతం నరసయ్య పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News