కరోనా వచ్చిందని ఎంత పని చేశారు.. ఈ చిన్నారుల పరిస్థితి ఏంటి..?

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మరోవైపు వైరస్‌ భయానికి పలువురు పేషెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మరింత కలచివేస్తున్నాయి. ఇటువంటి విషాద ఘటన కృష్ణా జిల్లాలోని పెడనలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్, భారతి భార్యా భర్తలు. వీరికిద్దరు పిల్లలు. 10 రోజుల క్రితం ఈ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో హోంఐసోలేషన్‌లో ఉంటున్న దంపతులు.. వైరస్ ఎంతకీ తగ్గడం లేదన్న […]

Update: 2021-05-20 21:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మరోవైపు వైరస్‌ భయానికి పలువురు పేషెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మరింత కలచివేస్తున్నాయి. ఇటువంటి విషాద ఘటన కృష్ణా జిల్లాలోని పెడనలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్, భారతి భార్యా భర్తలు. వీరికిద్దరు పిల్లలు. 10 రోజుల క్రితం ఈ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో హోంఐసోలేషన్‌లో ఉంటున్న దంపతులు.. వైరస్ ఎంతకీ తగ్గడం లేదన్న మనస్థాపంతో ఉరివేసుకున్నారు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చివరకు అనాథలుగా మిగలడం బాధాకరం.

Tags:    

Similar News