రామ్‌గోపాల్ వర్మకు మరో షాక్..

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. 2022లో విడుదలైన వ్యూహం సినిమాకు.. ఫైబర్ నెట్‌ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులు జారీ చేశారు.

Update: 2024-12-21 10:40 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మరో షాక్ తగిలింది. 2022లో విడుదలైన వ్యూహం(vyuham) సినిమాకు.. ఫైబర్ నెట్‌(Fiber net) నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులు జారీ(Issuance of notices) చేశారు. అందులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు.. అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా.. కీలకంగా వ్యవహరించిన పలువురికి నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటి ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేల చొప్పున తీసుకున్నారు. దీంతో వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీసులు(Legal notices) పంపింది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి(Chairman Jeevi Reddy) ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీ‌తో సహా ఐదుగురుకి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీ తో సహా మొత్తం కట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


Similar News