Allu Arjun : మరికాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్

నేటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater Incident) మీద, అల్లు అర్జున్(Allu Arjun) మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-21 13:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : నేటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater Incident) మీద, అల్లు అర్జున్(Allu Arjun) మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్ కు రాకూడదు అని చెప్పినప్పటికీ థియేటర్ కి వచ్చారని, తొక్కిసలాట(Stampede) జరిగిందని చెప్పినా వెళ్ళకుండా అక్కడే ఉన్నారని, తిరిగి వెళ్ళేప్పుడు రోడ్ షో చేస్తూ వెళ్లారని సీఎం ఆరోపించారు. అరెస్ట్ తర్వాత ఆయనను పరామర్శించేందుకు సినీ ప్రముఖలు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు కాని ఆసుపత్రిలో బాలున్ని చూసేందుకు ఒక్కరు కూడా వెళ్లలేదని ఫైర్ అయ్యారు. తాజాగా ఈ అంశం మీద స్పందించేందుకు అల్లు అర్జున్ తన నివాసంలో మరి కాసేపట్లో ప్రెస్ మీట్(Allu Arjun Press Meet) పెట్టబోతున్నారు. సీఎం చేసిన తీవ్ర ఆరోపణలపై బన్నీ ఏం మాట్లాడతాడా అని హాట్ టాపిక్ గా మారింది.   


Also Read..

Pushpa 2 : తగ్గాల్సిందే పుష్పా..!

Tags:    

Similar News