మోడీని అన్‌ఫాలో చేయడంపై వివరణ ఇచ్చిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు వైట్ హౌస్ అధికార ట్విట్టర్ ఖాతా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల నుంచి పలు విమర్శలు వచ్చాయి. కరోనాపై పోరులో అమెరికాకు భారత్ సాయం చేస్తున్నా ఇలా అన్‌ఫాలో చేసి అవమానించారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. కాగా, దీనిపై వైట్ హౌస్ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ అధికారిక […]

Update: 2020-04-30 03:11 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు వైట్ హౌస్ అధికార ట్విట్టర్ ఖాతా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల నుంచి పలు విమర్శలు వచ్చాయి. కరోనాపై పోరులో అమెరికాకు భారత్ సాయం చేస్తున్నా ఇలా అన్‌ఫాలో చేసి అవమానించారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. కాగా, దీనిపై వైట్ హౌస్ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ అధికారిక ఖాతాలు ఎప్పుడూ ఎవరినీ శాశ్వతంగా ఫాలో చేయవని.. ఆయా దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం దేశాధినేతలను ఫాలో అవుతుంటామని.. ఆ తర్వాత వారిని అన్‌ఫాలో చేస్తామని చెప్పారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ ట్విట్టర్ అకౌంట్‌ను రెండు కోట్ల మంది ఫాలో అవుతుండగా.. వైట్ హౌస్ మాత్రం కేవలం 13 ఖాతాలనే ఫాలో అవుతోంది.

Tags: Narendra Modi, Donald Trump, White House, Twitter, Followers

Tags:    

Similar News