కేసీఆర్ ఢిల్లీ టూర్.. సంజయ్, రేవంత్‌ సైలెంట్.. ఎందుకు ?

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయా? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సడెన్‌గా సైలెంట్ కావడానికి కారణాలేంటి ? గ్రేటర్‌ ఎలక్షన్‌లో హీట్‌పుట్టించిన నేతలు ఇప్పుడు కనీసం ప్రెస్‌మీట్లను పెట్టకపోవడంలో ఏం మర్మం దాగుంది ? ఎవరికివారు వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా? లేకుంటే ఇంకేమైనా వ్యూహముందా? అసలు రాష్ట్రంలో రాజకీయం ఇంత చప్పగా ఎందుకు తయారైంది. లెట్స్ వాచ్..! దుబ్బాక బైపోల్ పోలింగ్‌కు నెలరోజుల ముందు నుంచి గ్రేటర్ ఫలితాల […]

Update: 2020-12-22 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయా? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సడెన్‌గా సైలెంట్ కావడానికి కారణాలేంటి ? గ్రేటర్‌ ఎలక్షన్‌లో హీట్‌పుట్టించిన నేతలు ఇప్పుడు కనీసం ప్రెస్‌మీట్లను పెట్టకపోవడంలో ఏం మర్మం దాగుంది ? ఎవరికివారు వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా? లేకుంటే ఇంకేమైనా వ్యూహముందా? అసలు రాష్ట్రంలో రాజకీయం ఇంత చప్పగా ఎందుకు తయారైంది. లెట్స్ వాచ్..!

దుబ్బాక బైపోల్ పోలింగ్‌కు నెలరోజుల ముందు నుంచి గ్రేటర్ ఫలితాల వరకు రాష్ట్రంలో రాజకీయాన్ని రక్తి కట్టించిన నేతలు.. ప్రజెంట్ నామ్ కే వాస్త్ అన్నట్లుగా తయారయ్యారు. పాలిటిక్స్ అంటే చూద్దాం, మాట్లాడుదాంలే అన్నట్లుగా ఉంటూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీకి రాక.. ఎక్స్‌ అఫిషియో ఓట్లను కలుపుకున్నా మేయర్ సీటును దక్కించుకునే స్థితిలో లేని టీఆర్ఎస్ పార్టీ సైతం ఆచితూచి అడుగులు వేస్తుండటంతో ఫస్ట్‌ టైమ్ రాష్ట్రంలో పంచ్‌లు లేని పాలిటిక్స్‌ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మూడునెలల పాటు ఎవరికి వారు రాజకీయాలు చేసుకొని ఓట్లు పొందినా, ఆ తర్వాత గ్రేటర్ మేనిఫెస్టోలోని అంశాలపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా దూరంగా ఉండటం గమనార్హం.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత అధికార టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కవిత, తలసాని, ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి లాంటి కీలక లీడర్లు గమ్మున ఉండటం ఓ ఎత్తయితే అటు కాంగ్రెస్, బీజేపీ నుంచి సైతం అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. పీసీసీ చీఫ్ పదవి కోసం నాలుగు రోజులు రాష్ట్రంలో, రెండ్రోజులు ఢిల్లీలో హడావుడి చేసిన హస్తంపార్టీ నేతలు స్టేట్ పాలిటిక్స్‌లో ఎవరివారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. గత ఆరునెలలుగా స్వింగ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సైతం.. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి వచ్చాక వెంటనే హస్తిన ఫ్లైట్ ఎక్కడం, అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి కొద్దిగా హడావుడి చేసినా మళ్లీ ఎక్కడా కనిపించకపోవడంతో పాలిటిక్స్‌లో మరో రకమైన చర్చ జరుగుతోంది.

పోలింగ్‌కు వారం ముందు ఒకర్ని మించి మరొకరు మేనిఫెస్టోలు ప్రకటించి ఇప్పుడు గ్రేటర్‌లో ఎలాంటి సమస్యలను పట్టించుకోక పోవడంతో దుబ్బాక, గ్రేటర్‌లో జరిగింది ఓట్ల రాజకీయమేనన్న ప్రశ్నలు నగర ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మూడు పార్టీల్లోని ఇద్దరు ముగ్గురు కీలక నేతలు అడపాదడపా మాట్లాడుతున్నా, గ్రేటర్ ఎన్నికల హామీలను పట్టించుకోక పోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. గులాబీ బాస్ హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితం కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌లోని డివిజన్లలో కాలికి బలపం కట్టుకొని తిరిగిన రేవంత్‌ సైతం.. బీజేపీ, టీఆర్ఎస్‌‌ను ఏమీ అనడం లేదు. కార్పొరేటర్లను భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు తీసుకెళ్లి ప్రమాణం చేయించిన బండి సంజయ్ సైతం.. హామీలను లేవనెత్తడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రముఖంగా మీడియాలో కనిపించే ఫైర్ బ్రాండ్ లీడర్లు బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి సైతం.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏదో వెలితితో ఉన్నట్లు కనిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న విశ్లేషణలకు బలం చేకూరుస్తోంది.

Tags:    

Similar News