అలిగిన కేటీఆర్… ఆ స్థానంలో కవిత!!

దిశ, తెలంగాణ బ్యూరో : సాధారణంగా ఒక పదవి లభించిన వెంటనే ఆ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. కానీ జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మాత్రం ఇప్పటివరకు ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలవలేదు. కలవడానికి మంత్రి టైమ్ ఇవ్వలేదా? లేక కలవడానికి మేయరే ఆసక్తిగా లేరా? కారణాలేవైనా సంబంధిత శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన మంత్రి […]

Update: 2021-02-17 04:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సాధారణంగా ఒక పదవి లభించిన వెంటనే ఆ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. కానీ జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మాత్రం ఇప్పటివరకు ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలవలేదు. కలవడానికి మంత్రి టైమ్ ఇవ్వలేదా? లేక కలవడానికి మేయరే ఆసక్తిగా లేరా? కారణాలేవైనా సంబంధిత శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన మంత్రి కేటీఆర్ చివరకు మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఆ కారణంగానే తాను అనుకున్న వ్యక్తికి కాకుండా గద్వాల విజయలక్ష్మికి అవకాశం ఇవ్వడాన్ని కేటీఆర్ విభేదించినట్లు సమాచారం. అందువల్లనే ఆమెను కలవడానికి కేటీఆర్ సుముఖంగా లేరన్నది పార్టీ వర్గాల సమాచారం.

జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకుని నిర్వహించినా మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో అలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కేటీఆర్ నొచ్చుకున్నట్లు తెలిసింది. సీల్డ్ కవర్‌ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న రోజు కార్పొరేటర్లతో కేటీఆర్ ముచ్చటించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొత్త కార్పొరేటర్లందరి ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మేయర్ ఎన్నిక సందర్భంగా సీల్డ్ కవర్ విప్పిన తర్వాత గద్వాల విజయలక్ష్మి పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటికే బహుశా కేటీఆర్‌కు మేయర్ ఎవరవుతున్నారో తెలిసి ఉండొచ్చు. అందుకే జీహెచ్ఎంసీకి రాకుండా తెలంగాణ భవన్‌లోనే ఉండిపోయారు.

కొత్త కార్పొరేటర్లను సమన్వయించడం మొదలు మేయర్ ప్రమాణ స్వీకారం వరకు కేటీఆర్ పోషించాల్సిన పాత్రను ఆయన సోదరి కవిత వ్యవహరించారు. కొత్త కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులంతా కవితకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజున కవిత ‘సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‘గా నిలిచారు. వారం రోజులు గడుస్తున్నా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ భేటీ కాకపోవడం విశేషం. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై ఆ శాఖ మంత్రిగా కేటీఆర్‌తో ఇకపైన మేయర్ హోదాలో పలుమార్లు గద్వాల విజయలక్ష్మి చర్చలు జరపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని పొందాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుతం వీరిద్దరి మధ్య తూర్పు-పడమరగానే ఉన్నారు. ఇకపైన కూడా వీరి వ్యవహారం ఇదే తీరులో కొనసాగుతుందా? లేక కొలిక్కి వస్తుందా? సమీక్షా సమావేశాల్లో వీరి మధ్య భిన్నాభిప్రాయాలు మరో రూపంలో రిఫ్లెక్ట్ అవుతాయా? భవిష్యత్తులో జీహెచ్ఎంసీ విషయంలో మంత్రి కేటీఆర్ అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తారా? తనకేం సంబంధం లేదని లైట్‌గా తీసుకుంటారా? అసలే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని గంపెడాశతో ఉన్న కేటీఆర్ నోటికాడి ముద్ద నేల రాలిపోయిందే అనే నిరుత్సాహంతో ఉన్నట్లు సన్నిహితులే వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో కనీసం మేయర్ అభ్యర్థిగా తన ఛాయిస్ వ్యక్తిని కూడా ఎంపిక చేయించుకోలేకపోయానే అనే బాధ కూడా తోడైంది.

నగర అభివృద్ధిపై మంత్రి నిర్వహించే రివ్యూ మీటింగ్‌లో గద్వాల విజయలక్ష్మి తీరుగానీ, దానికి ప్రతిస్పందనంగా కేటీఆర్ వ్యవహారశైలిగానీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్​ పట్టభద్రుల స్థానంపై గులాబీ మల్లగుల్లాలు

Tags:    

Similar News