నోరు తెరవడం లేదెందుకు..? : వంశీచంద్ రెడ్డి

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కృష్ణా జలాలలో మన వాటా మనకొస్తయని 2009 ఎన్నికలలో చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక ఏపీ జల దోపిడీ మరింత పెరిగిపోయిందని, అన్ని తెలిసి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు ఉన్న లాలూచీ ఏమిటని బయటపెట్టాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా […]

Update: 2020-05-11 08:06 GMT

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కృష్ణా జలాలలో మన వాటా మనకొస్తయని 2009 ఎన్నికలలో చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక ఏపీ జల దోపిడీ మరింత పెరిగిపోయిందని, అన్ని తెలిసి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు ఉన్న లాలూచీ ఏమిటని బయటపెట్టాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. జిల్లా ఏడారి కాకుండా ఆంధ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల కూసెక్కుల నీటిని తీసుకుపోయేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైస్. రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు ఇస్తే అప్పట్లో తెలంగాణ నేతలు సన్నాసులు, దద్దమ్మలు అని నిందించి.. తెలంగాణ ఎడారిగా మారిపోతుందని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు 80 వేల క్యూసెక్కుల కోసం జీవో 203 జారీ చేసినా నోరు తెరవడం లేదేంటని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఇంత పెద్దఎత్తున నీరు తరలిస్తే పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి, కొంత నల్గొండ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. ఈ అంశంపై అఖిల పక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని, వెంటనే ఏపీ నీటి దోపిడీని అడ్డుకొని తెలంగాణ ఏర్పాటు లక్షాన్ని సాధించాలని, కృష్ణ పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News