అమెజాన్ ప్రైమ్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌కు బ్రేక్

దిశ, ఫీచర్స్ : అమెజాన్ తమ ఇండియా యూజర్లకు మంత్లీ ప్రైమ్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాదు ప్రైమ్ కోసం ఉచిత ట్రయల్ ఇవ్వడం కూడా కంపెనీ నిలిపివేసింది. ఇకపై ప్రైమ్ తీసుకోవాలనుకుంటే యూజర్స్ మూడు నెలల లేదా వార్షిక ప్రైమ్ సభ్యత్వాలను మాత్రమే తీసుకోవాలి. అమెజాన్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయడానికి కారణమేంటీ? ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్‌లో ఇదివరకు నెలవారి ప్యాక్ రూ.129 కాగా, మూడు నెలలకు రూ.329, ఏడాదికి రూ.999 […]

Update: 2021-05-18 02:15 GMT

దిశ, ఫీచర్స్ : అమెజాన్ తమ ఇండియా యూజర్లకు మంత్లీ ప్రైమ్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాదు ప్రైమ్ కోసం ఉచిత ట్రయల్ ఇవ్వడం కూడా కంపెనీ నిలిపివేసింది. ఇకపై ప్రైమ్ తీసుకోవాలనుకుంటే యూజర్స్ మూడు నెలల లేదా వార్షిక ప్రైమ్ సభ్యత్వాలను మాత్రమే తీసుకోవాలి. అమెజాన్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయడానికి కారణమేంటీ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్‌లో ఇదివరకు నెలవారి ప్యాక్ రూ.129 కాగా, మూడు నెలలకు రూ.329, ఏడాదికి రూ.999 వంటి మూడు ప్లాన్స్ అందుబాటులో ఉండేవి. అయితే ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్​ వెల్లడించింది. రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్​ వంటి రికరింగ్​ ఆన్​లైన్​ లావాదేవీల కోసం అడిషనల్​ ఫ్యాక్టర్​ ఆఫ్​ అథెంటికేషన్​ (ఏఎఫ్​ఏ)ను అమలు చేయాలని బ్యాంకులను, ఫైనాన్స్​ సంస్థలను ఆర్బీఐ ఆదేశించించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఎఫ్​ఏ నిబంధనలకు లోబడి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ రూ. 129ని తొలగించినట్లు అమెజాన్​ పేర్కొంది. ఈ కొత్త ఆదేశాలను మార్చి 31 నుంచే అమలు చేయాలని ఆర్బీఐ భావించగా.. బ్యాంకులు, పేమెంట్ గేట్​వేల వినతితో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.

అమెజాన్ తాత్కాలికంగానే మంత్లీ ప్లాన్‌ను నిలిపివేసిందా? భవిష్యత్తులో మళ్లీ ఈ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుందా? అనే విషయాలపై అమెజాన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్‌స్టార్ వంటి ఓటీటీల నుంచి గట్టిపోటీనిస్తున్న అమెజాన్‌కు ఈ నిర్ణయం వల్ల సబ్‌స్క్రిప్షన్ తగ్గే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News