న్యూయార్క్ ప్రజల జీవన విధానమే.. కరోనా విజృంభణకు కారణమా?
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా.. కరోనా దెబ్బకు కుదేలవుతున్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పుడ ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగానే.. కాదు.. అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. కరోనాకు అతిపెద్ద బాధితురాలిగా మారింది. ఆ దేశంలోనూ న్యూయార్క్ పరిస్థితి దారుణంగా ఉన్నది. అమెరికాలో తొలి కరోనా కేసులు న్యూయార్క్‌లో నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నగరంలో నమోదైన కేసుల సంఖ్య చూస్తే దిమ్మదిరిగిపోతున్నది. అమెరికాలో 5,32,879 కరోనా పాజిటీవ్ కేసులుండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే […]
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా.. కరోనా దెబ్బకు కుదేలవుతున్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పుడ ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగానే.. కాదు.. అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. కరోనాకు అతిపెద్ద బాధితురాలిగా మారింది. ఆ దేశంలోనూ న్యూయార్క్ పరిస్థితి దారుణంగా ఉన్నది. అమెరికాలో తొలి కరోనా కేసులు న్యూయార్క్‌లో నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నగరంలో నమోదైన కేసుల సంఖ్య చూస్తే దిమ్మదిరిగిపోతున్నది. అమెరికాలో 5,32,879 కరోనా పాజిటీవ్ కేసులుండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,81,114 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అక్కడ మృతుల సంఖ్య 9 వేలకు చేరువలో ఉన్నది. దీంతో న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రుల్లో ఎటుచూసినా.. మృతదేహాలే కనపడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న వారి నుంచి ఆరోగ్య వంతులను కాపాడలేక అక్కడి వైద్య సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. కాగా న్యూయార్క్‌లో ఇంతలా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమేంటని ఒక అధ్యయనం నిర్వహించగా పలు విషయాలు వెల్లడయ్యాయి.
ఇవీ..
ఆ ఆసక్తికర విషయాలు..
– అమెరికాలోని మిగతా ప్రాంతాలకంటే న్యూయార్క్ నగరానికి రెండు వారాల ముందే కరోనా ప్రవేశించింది.
– న్యూయార్క్‌లో కరోనా సోకిన 100 మందిలో 4.7గురు చనిపోతున్నారు. అమెరికాలోని మిగతా ప్రాంతాల్లో దీని శాతం 3.4గా ఉంది.
– అమెరికాలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరం న్యూయార్క్. ఆ నగరం జనాభా 80 లక్షలు.
– ఈ నగరంలో అపార్ట్‌మెంట్ల అద్దెలు చాలా ఎక్కువగా ఉండటంతో ఒకే ఫ్లాట్‌లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. దీంతో కరోనా వేగంగా సోకింది.
– న్యూయార్క్ ప్రజలు ఫ్లూ షాట్స్ (ఒక రకమైన వ్యాక్సిన్) వాడుతుంటారు. దీంతో సహజంగా ఉండే వ్యాది నిరోదక శక్తి తగ్గిపోయింది. ఫలితంగా కరోనా వైరస్‌ను ఎదుర్కునే శక్తి లేకుండా పోయింది.
– న్యూయార్క్‌లోని పేదలకు సరైన చికిత్స అందిచట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి నల్లజాతీయుల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది.
– న్యూయార్క్‌లో కరోనా బారిన పడి మరణించిన వారిలో 62 శాతం మంది నల్లజాతీయులే.
– న్యూయార్క్ నగరంలో 60 నుంచి 80 ఏళ్ల వారే ఎక్కువగా మరణించారు. వారికి బీపీ, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాదులు కూడా ఉన్నాయి.
– ఇక ప్రస్తుతం న్యూయార్క్‌లో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. కరోనా 30 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుందని శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.
Tags: america, coronavirus, newyork, reasons, why surged