కొవిడ్ ఇన్‌ఫెక్షన్ స్థాయిని నిర్ధారించే ‘సీఆర్‌పీ’

దిశ, ఫీచర్స్ : కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోవడానికి యాంటీజెన్, ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమందికి ఇందులో కూడా నెగెటివ్ వస్తుండటంతో చెస్ట్ ఎక్స్‌రే, సిటీ స్కానింగ్‌ను రిఫర్ చేస్తున్న డాక్టర్లు.. ఈ క్రమంలో సీ-రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్‌పీ) పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు మోడరేట్ టు మైల్డ్ లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ పాజిటివ్ రోగులకు కూడా ఎక్కువగా ఇదే పరీక్షను సిఫార్సు చేస్తున్నారు వైద్యులు. […]

Update: 2021-05-09 06:11 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోవడానికి యాంటీజెన్, ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమందికి ఇందులో కూడా నెగెటివ్ వస్తుండటంతో చెస్ట్ ఎక్స్‌రే, సిటీ స్కానింగ్‌ను రిఫర్ చేస్తున్న డాక్టర్లు.. ఈ క్రమంలో సీ-రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్‌పీ) పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు మోడరేట్ టు మైల్డ్ లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ పాజిటివ్ రోగులకు కూడా ఎక్కువగా ఇదే పరీక్షను సిఫార్సు చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ దీని ప్రాధాన్యత ఏమిటి? ప్రయోజనాలేంటి?

నిజానికి ఇది ఒక రమైన రక్త పరీక్ష మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినపుడు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ స్థాయి గురించి చెప్పడంతో పాటు ఇన్‌ఫెక్షన్ లెవల్‌ను సూచిస్తుంది. CRP పరీక్షలు రక్తంలో కాలేయం వల్ల తయారైన సీ-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిని చూపించే మార్కర్ అని చెప్పొచ్చు. CRP అనేది డయాగ్నొస్టిక్ పరీక్ష కాదు కానీ, దీనికి ప్రోగ్నోస్టిక్(వైద్య పరిస్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడే టెస్ట్) విలువ ఉంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్ స్థాయిని అంచనా వేస్తుంది కనుకే ఆస్పత్రి సంరక్షణలో, క్రిటికల్ కండిషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఈ టెస్ట్‌ను తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు, ఎందుకంటే ఇది కొనసాగుతున్న చికిత్సకు శరీర ప్రతిచర్యను చూపించే సూచికల్లో ఒకటి.

‘సీఆర్‌పీ పరీక్ష.. సీటీ స్కాన్ వలె ఖరీదైనది కాదు కాబట్టే రోగులకు సిఫార్సు చేస్తున్నాం. ఈ పరీక్షను 4-5 రోజుల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించడం వల్ల పేషెంట్లలోని సీఆర్‌పీ స్థాయి తెలుస్తుంది. ఈ ఫలితాల ఆధారంగా వైద్యులు తదుపరి చర్యను నిర్ణయించగలరు’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజోత్ సింగ్ దహియా అన్నారు. ఒక రోగి లక్షణాల్లో ఎటువంటి మెరుగుదల కనిపించకపోతే.. వారికి స్టెరాయిడ్లను సిఫారసు చేయవచ్చని తెలిపారు.

సీఆర్‌పీ సాధారణమైతే, రోగి శరీరం చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు అర్థం. ఇది అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటే, వైద్యులు సీటీ స్కాన్ ద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్ స్థాయి ఎంత మేర ఉందో తెలుసుకుంటారు. ఒక వారం గడిచిన తరువాత కూడా వారి లక్షణాల్లో ఎటువంటి మెరుగుదల లేకపోతే, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కరోన బాధితులకు కూడా దీన్ని సిఫార్సు చేయాలని కొవిడ్ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్‌లో ఉంది. ఆక్సిజన్ స్థాయి 93 నుంచి 97 మధ్య హెచ్చుతగ్గులకు లోనైనా సీఆర్‌పీ టెస్ట్ నిర్వహిస్తాం.
– డాక్టర్ ఎస్ఎస్ జోహాల్, జలంధర్

దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీ టెస్ట్ అనేది రోగులకు ఇంట్లోనే చికిత్స అందించేలా వైద్యులకు సాయపడుతుంది. తద్వారా వారు తీవ్రమైన అనారోగ్యం నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వైద్యులతో పాటు రోగులకు కూడా ఉపయోగకరమైన టెస్ట్.

 

Tags:    

Similar News