కోవాగ్జిన్ టీకా తీసుకుంటే యూఎస్, యూకేలో నో ఎంట్రీ..?
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా తయారైన కొవిడ్ వ్యాక్సిన్‌లలో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇండియాలో కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిని తమ దేశంలోనికి రానివ్వమని తాజాగా అమెరికా, యూనైటెడ్ కింగ్ డమ్ ప్రకటించాయి. ప్రపంచఆరోగ్య సంస్థ (WHO) యూస్ లిస్ట్‌లో ఉన్న టీకాలు తీసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని ఈ రెండు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు ప్రయాణం చేయదలుచుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా తయారైన కొవిడ్ వ్యాక్సిన్‌లలో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇండియాలో కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిని తమ దేశంలోనికి రానివ్వమని తాజాగా అమెరికా, యూనైటెడ్ కింగ్ డమ్ ప్రకటించాయి. ప్రపంచఆరోగ్య సంస్థ (WHO) యూస్ లిస్ట్‌లో ఉన్న టీకాలు తీసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని ఈ రెండు దేశాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు ప్రయాణం చేయదలుచుకున్న వారు తప్పకుండా కోవాగ్జిన్ కాకుండా ఇతర టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కోవాగ్జిన్‌కు టీకాకు WHO అత్యవసర వాడకం లిస్టింగ్‌లో ఇంకా చోటు దక్కలేదు. దీంతో భారత్ బయోటెక్ సంస్థకు కొత్త చిక్కులు ఎదురవనున్నట్లు సమాచారం.