ఆ ఇద్దరిలో టీఆర్ఎస్వీ పగ్గాలు చేపట్టేది ఎవరో..?.. సీఎం మదిలో ఉన్నది ఆయనేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ కు టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించడంతో ఈ స్థానం కోసం విద్యార్థి నేతలు పోటీ పడుతున్నారు. ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన నేతలు నాటి నుంచి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. వాళ్లలోనే ఒకరిని ఎంపిక చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు బయోడేటాను అందజేశారు. టీఆర్ఎస్ […]

Update: 2021-08-24 20:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ కు టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించడంతో ఈ స్థానం కోసం విద్యార్థి నేతలు పోటీ పడుతున్నారు. ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన నేతలు నాటి నుంచి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. వాళ్లలోనే ఒకరిని ఎంపిక చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు బయోడేటాను అందజేశారు.

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అనుబంధ సంఘమైన టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి ఖాళీ కాబోతోంది ఈ నేపథ్యంలో ఎవరికి ఆ స్థానం అప్పగిస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కీలకంగా టీఆర్ఎస్వీ వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వారి వ్యాఖ్యలను తిప్పికొట్టడంలోనూ ముందుంటారు. రాజకీయాలకు కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉండటం, అక్కడి నుంచే టీఆర్ఎస్వీ అధ్యక్షుడిని నియమిస్తారు.

అయితే గతంలో కూడా టీఆర్ఎస్వీకి విద్యార్థులు నాయకులు పోటీ పడటంతో అధ్యక్ష, జనరల్ సెక్రటరీలుగా నియమించారు. అయితే ప్రస్తుతం అధ్యక్ష పదవికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన స్వామియాదవ్, తుంగ బాలు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అనుచరుడు స్వామియాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అనుచరుడు తుంగ బాలు కావడం గమనార్హం. తుంగ బాలు దళిత సామాజిక వర్గంలోని మాల కేటగిరి చెందిన వారు కావడం, ప్రస్తుతం దళిత బంధు నేపథ్యంలో అధిష్టానం బాలు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే గెల్లు శ్రీనివాస్ కు పార్టీ బీఫాం ఇచ్చేవరకు అధ్యక్ష పదవిని పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. పదవి కోసం స్వామియాదవ్, తుంగ బాలు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ కు బయోడేటాను అందజేశారు. అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తే మరొకరికి జనరల్ సెక్రటరీ పదవి కేటాయించే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News