కొత్తూరు మున్సిపల్ ‘చైర్మన్’ పీఠం ఎవరిది.?
దిశ, షాద్ నగర్ : ఎన్నికల ఫలితాల ఉత్కంఠతకు తెరపడింది. నూతన కొత్తూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో7 స్థానాలలో అధికార టీఆర్ఎస్ గెలుపొందింది. మున్సిపల్ పీఠాన్ని కారు పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కొత్తూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులలో 8వ వార్డు నుంచి గెలుపొందిన బి.లావణ్య దేవేందర్ యాదవ్, 10 వ వార్డు నుంచి గెలుపొందిన కరుణ సుదర్శన్ గౌడ్ లలో ఒకరికి […]
దిశ, షాద్ నగర్ : ఎన్నికల ఫలితాల ఉత్కంఠతకు తెరపడింది. నూతన కొత్తూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో7 స్థానాలలో అధికార టీఆర్ఎస్ గెలుపొందింది. మున్సిపల్ పీఠాన్ని కారు పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కొత్తూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులలో 8వ వార్డు నుంచి గెలుపొందిన బి.లావణ్య దేవేందర్ యాదవ్, 10 వ వార్డు నుంచి గెలుపొందిన కరుణ సుదర్శన్ గౌడ్ లలో ఒకరికి చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న తమ నాయకుడు దేవేందర్ యాదవ్ సతీమణి లావణ్యకే చైర్మన్ పదవి లభిస్తుందని ఆయన అనుచరులు అంచనా వేస్తుండగా, చైర్మన్ పదవి కమిట్మెంట్‌తోనే టీఆర్ఎస్‌లో చేరడమే కాకుండా తన అనుచరులకు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్న తమ నాయకుడు సుదర్శన్ గౌడ్ సతీమణి కరుణకే చైర్మన్ పీఠం వరిస్తుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.