లాక్ డౌన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు @ ఫేక్ న్యూస్

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి ఓ వైపు ప్రజల్లో ఆందోళన రేపుతుంటే.. మరో వైపు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు ప్రజల్లో అంతకుమించి రెట్టింపు భయాన్ని కలిగిస్తున్నాయి. ఫేక్ వార్తలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో.. సోషల్ మీడియా లో ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తే.. జైలు శిక్ష వేస్తామని పోలీసులు కూడా అదేశాలు జారీ చేశారు. వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపులో ఎవరు ఎలాంటి తప్పుడు సమాచారం పెట్టినా, షేర్ చేసినా.. […]

Update: 2020-04-07 03:22 GMT

దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ వ్యాప్తి ఓ వైపు ప్రజల్లో ఆందోళన రేపుతుంటే.. మరో వైపు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు ప్రజల్లో అంతకుమించి రెట్టింపు భయాన్ని కలిగిస్తున్నాయి. ఫేక్ వార్తలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో.. సోషల్ మీడియా లో ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తే.. జైలు శిక్ష వేస్తామని పోలీసులు కూడా అదేశాలు జారీ చేశారు. వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపులో ఎవరు ఎలాంటి తప్పుడు సమాచారం పెట్టినా, షేర్ చేసినా.. ఆ వ్యక్తితోపాటు అడ్మిన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేస్తారు. కనీసం 3 నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. తాజాగా బెంగళూరులోని ఓ వాట్సాప్ గ్రూపులో ఓ సభ్యుడు చేసిన తప్పుకు పోలీసులు అడ్మిన్‌ను కూడా అరెస్టు చేశారు. అయినా ఈ వదంతులు ఆగట్లేవు. తాజాగా లాక్ డౌన్ పొడగింపుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గ దర్శకాలు జారీ చేసేందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తప్పుడు న్యూస్ అని ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది.

దేశంలో లాక్ డౌన్ ని ఏ విధంగా అమలు చేయాలన్న దాని పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు జారీచేసిందనే వార్త సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం, దేశంలో మొదటి విడుతలో ఒక రోజు, రెండో విడతలో 21 రోజులు, అనంతరం ఐదు రోజులు విరామం ఇచ్చి మూడో విడుతలో 28 రోజులు, ఆ తర్వాత ఐదు రోజుల విరామం అనంతరం మళ్లీ 15 రోజులు లాక్ డౌన్ విధిస్తారంటూ అందులో ఉంది. దాన్ని బట్టి మన దేశంలో 14 ఏప్రిల్ అనంతరం ఐదు రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 28 రోజుల లాక్ డౌన్ ని విధిస్తారని చెప్తున్నారు. కాని, FACTCHECK.TELANGANA.GOV.IN విశ్లేషణ లో ఆ విషయం లో ఎటువంటి నిజం లేదని తేలింది. దేశంలో లాక్ డౌన్ ని ఏ విధంగా అమలు చేయాలన్న విషయం మీద తాము మార్గదర్శకాలేమీ జారీ చేయలేదని, అలాంటి వార్తలు నిరాధారమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. వాట్సాప్‌లో WHO పేరుతో చక్కర్లు కొడుతున్న లాక్‌డౌన్ షెడ్యూల్ నిజం కాదని, అది ఫేక్ వార్త అని ట్వీట్ చేసింది. దీనిపై WHO South-East Asia కూడా స్పందించింది. ‘‘సోషల్ మీడియాలో WHO పేరుతో వస్తున్న వార్తలు ఫేక్. WHO ఇప్పటివరకు లాక్‌డౌన్‌‌పై ఎలాంటి ప్రోటోకాల్స్ విధించలేదు’’ అని అందులో పేర్కొంది.


Tags: corono virus, who, lock down, factcheck, telangana govt

Tags:    

Similar News