పెళ్లి చేసుకుంటానని బాలిక కిడ్నాప్.. ఆపై ఇద్దరు కంత్రిగాళ్లు కలిసి..!
దిశ, కామారెడ్డి : ఆ బాలికకు బాహ్య ప్రపంచం ఇంకా తెలియదు. 13 ఏళ్ల వయసున్న బాలికకు ఓ యువకుడు మాయమాటలతో దగ్గరయ్యాడు. అతని స్నేహితుని సహాయంతో బాలికను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగకుండా నకిలీ పత్రాలు సృష్టించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపురా కాలనీలో నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన ముజాహిద్ అనే […]
దిశ, కామారెడ్డి : ఆ బాలికకు బాహ్య ప్రపంచం ఇంకా తెలియదు. 13 ఏళ్ల వయసున్న బాలికకు ఓ యువకుడు మాయమాటలతో దగ్గరయ్యాడు. అతని స్నేహితుని సహాయంతో బాలికను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగకుండా నకిలీ పత్రాలు సృష్టించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపురా కాలనీలో నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన ముజాహిద్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటి పక్కనే 13 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది.
ఈ క్రమంలో ముజాహిద్ బాలికతో మాటమాట కలిపాడు. మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. పెళ్లి చేసుకుందామని నమ్మ బలికాడు. ఓ రోజు బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. కిడ్నాప్ కోసం మరో స్నేహితుడు సల్మాన్ సహకారం తీసుకున్నాడు ముజాహిద్. 40 రోజుల క్రితం ఇద్దరు కలిసి బాలికను కిడ్నాప్ చేసి నిజామాబాద్ తీసుకెళ్లారు. మైనర్ బాలికకు పెళ్లి వయసున్నట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా మైనర్ బాలికను ముజాహిద్ వివాహం చేసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్ల ప్రకారం నిజామాబాదులో మైనర్ బాలికను ఖాజీ సమక్షంలో ముజాహిద్ వివాహం చేసుకున్నాడు.
ఇందుకు ముజాహిద్ అతని స్నేహితుడు సల్మాన్ సహకారం తీసుకున్నాడు. మైనర్ బాలిక కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముజాహిద్ కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు నిర్దారించుకున్నారు. మాయమాటలు చెప్పి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మైనర్ బాలికను వివాహం చేసుకున్న ముజాహిద్‌ను అతనికి సహకరించిన సల్మాన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. తమ కూతురికి నమ్మించి వివాహం చేసుకున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.