WHO చేతిలో కీలక ఆధారాలు.. కరోనా పుట్టిల్లు వూహానే!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ వూహాన్‌లో పుట్టిందని.. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 14 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందం గత రెండు వారాలుగా చైనాలోని వూహాన్‌లో పర్యటిస్తోంది. వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తల బృందం కరోనా పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. కాగా, కొవిడ్ వ్యాప్తిలో వూహాన్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ వూహాన్‌లో పుట్టిందని.. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 14 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందం గత రెండు వారాలుగా చైనాలోని వూహాన్‌లో పర్యటిస్తోంది.
వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తల బృందం కరోనా పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. కాగా, కొవిడ్ వ్యాప్తిలో వూహాన్ సీపుడ్ మార్కెట్ ప్రాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు డబ్ల్యూహెచ్‌వో బృందం సభ్యుడు పీటర్ డెస్‌జాక్ సోషల్ మీడియాల్లో తెలిపారు. కరోనా కేసులు బయటపడగానే వూహాన్‌లోని మాంసం మార్కెట్‌ను చైనా ప్రభుత్వ యంత్రాంగం శుభ్రం చేయించిందని గుర్తించింది. అయితే మార్కెట్‌లో దుకాణాదారులు వదిలివెళ్లిన పరికరాలు, సామాగ్రి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. మరోవైపు వూహాన్ మాంసం మార్కెట్‌లో ఏమేం అమ్ముతారు? జంతువులు, సముద్ర ఉత్పత్తులు ఎక్కడెక్కడి నుంచి మార్కెట్‌కు వస్తుంటాయి? అనే సమాచారాన్ని అక్కడి వ్యాపారుల నుంచి సేకరించినట్లు తెలిపారు.
వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తల బృందం పర్యటన ఫిబ్రవరి 10న ముగిస్తుందని.. దీనికి సంబంధించిన నివేదికను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ బృందం వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశమైంది. అలాగే మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.