చైనాను పొగడ్తలతో ముంచెత్తిన డబ్ల్యూహెచ్‌వో
బీజింగ్/న్యూయార్క్ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా అద్భుత విజయం సాధించిందని.. ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా వైరస్‌ను నిలువరించగలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. అయితే కరోనా పుట్టుకకు చైనానే కారణమని.. ఆ దేశం నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచ దేశాలు ఇంతలా బాధపడుతున్నాయని ఓ వైపు ట్రంప్ ప్రతీ రోజు విమర్శలు గుప్పిస్తుండగా.. చైనాకు డబ్ల్యూహెచ్‌వో వత్తాసు పలకడంపైనా అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. కానీ డబ్ల్యూహెచ్‌వో మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవడం […]
బీజింగ్/న్యూయార్క్ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా అద్భుత విజయం సాధించిందని.. ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా వైరస్‌ను నిలువరించగలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. అయితే కరోనా పుట్టుకకు చైనానే కారణమని.. ఆ దేశం నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచ దేశాలు ఇంతలా బాధపడుతున్నాయని ఓ వైపు ట్రంప్ ప్రతీ రోజు విమర్శలు గుప్పిస్తుండగా.. చైనాకు డబ్ల్యూహెచ్‌వో వత్తాసు పలకడంపైనా అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. కానీ డబ్ల్యూహెచ్‌వో మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
కరోనా కారణంగా అత్యంత దారుణ స్థితికి చేరిన వూహాన్ నగరం తిరిగి సాధారణ స్థితికి ఎలా చేరుకుందో ప్రతీ దేశం చూసి నేర్చుకోవాలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతం అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం మంచి పరిణామమని వెల్లడించింది. కాగా, కరోనా కట్టడికి వూహాన్‌లో అనుసరిస్తున్న వ్యూహాలు, చికిత్సా విధానం ఏమిటో ప్రపంచానికి ఇంకా పూర్తి సమాచారం లేదు. ఈ విషయమై అమెరికా ప్రతీ రోజు ప్రశ్నిస్తున్నా సమాధానం మాత్రం దొరకడం లేదు. అందుకే ట్రంప్ ప్రతీ రోజు చైనా, డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags : China, Wuhan, Coronavirus, WHO, USA, Donal Trump, Covid 19