పాక్‌ ‘జూ’లో తెల్ల పులిపిల్లలు మృతి..

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ఓ జంతు ప్రదర్శన శాలలో 11వారాల వయస్సున్న రెండు తెల్లపులి పిల్లలు మరణించాయి. వీటి మృతికి కొవిడ్-19 కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జనవరి 30వ తేదీన తెల్ల పులి పిల్లలు మరణించగా.. తొలుత ‘పాన్యుకోపెనియా’ అనే వైరస్‌ వలన చనిపోయి ఉండవచ్చని భావించారు. ఈ వైరస్ పాక్‌లో సర్వసాధారణం. వీటికి పోస్టుమార్టం నిర్వహించగా పులి కూనల ఊపిరితిత్తులు బాగా చెడిపోయాయని నిర్దారణ అయింది. ఇదిలాఉండగా, పాథాలజిస్టులు […]

Update: 2021-02-13 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ఓ జంతు ప్రదర్శన శాలలో 11వారాల వయస్సున్న రెండు తెల్లపులి పిల్లలు మరణించాయి. వీటి మృతికి కొవిడ్-19 కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జనవరి 30వ తేదీన తెల్ల పులి పిల్లలు మరణించగా.. తొలుత ‘పాన్యుకోపెనియా’ అనే వైరస్‌ వలన చనిపోయి ఉండవచ్చని భావించారు.

ఈ వైరస్ పాక్‌లో సర్వసాధారణం. వీటికి పోస్టుమార్టం నిర్వహించగా పులి కూనల ఊపిరితిత్తులు బాగా చెడిపోయాయని నిర్దారణ అయింది. ఇదిలాఉండగా, పాథాలజిస్టులు మాత్రం ఆ రెండు పసికూనల మృతికి కరోనా వైరస్ కారణమని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News