వాటిని బీజేపీ కంట్రోల్ చేస్తోంది : రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ పార్టీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా మాద్యమాలను ఆ పార్టీ కంట్రోల్ చేస్తోందని.. దేశ ప్రజలను విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. దాని ఆధారంగా రాహుల్ గాంధీ స్పందించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు […]
దిశ, వెబ్ డెస్క్ :
బీజేపీ పార్టీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా మాద్యమాలను ఆ పార్టీ కంట్రోల్ చేస్తోందని.. దేశ ప్రజలను విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. దాని ఆధారంగా రాహుల్ గాంధీ స్పందించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని ఆరోపించారు.
తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేసిన రాహుల్ ‘ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని.. ఈ మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారు. అమెరికన్ మీడియా ఈ నిజాన్ని బయటపెట్టింది’ అని రాసుకొచ్చారు.
విద్వేషపూరిత ప్రసంగాలపై కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్ ఉద్యోగులతో అధినేత మార్క్ జూకర్ బర్గ్ చర్చించారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులకు సూచించారు. అయితే, ఇండియాలో బీజేపీ నుంచి వస్తున్న విద్వేష కంటెంట్ విషయంలో ఫేస్‌బుక్ చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ప్రధానంగా పేర్కొంది.