సుశాంత్ కేసులో డ్రగ్ యాంగిల్!

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చాలా విషయాలు రియాను దోషిగా నిలబెడుతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ దర్యాప్తు చేస్తుండగా.. కొత్తగా రియా డ్రగ్ మాఫియాతో చేసిన చాట్‌ను వెలుగులోకి తెచ్చింది సీబీఐ. డ్రగ్ డీలర్స్‌తో జరిగిన చాట్‌ను రియా డిలీట్ చేసినప్పటికీ, ఆ చాట్‌ను బహిర్గతం చేసిన సీబీఐ.. సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా ప్రమేయం ఉందని చెప్తోంది. 2017 మార్చి 8న డ్రగ్ డీలర్ గౌరవ్‌తో చాట్ చేసింది […]

Update: 2020-08-26 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చాలా విషయాలు రియాను దోషిగా నిలబెడుతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ దర్యాప్తు చేస్తుండగా.. కొత్తగా రియా డ్రగ్ మాఫియాతో చేసిన చాట్‌ను వెలుగులోకి తెచ్చింది సీబీఐ. డ్రగ్ డీలర్స్‌తో జరిగిన చాట్‌ను రియా డిలీట్ చేసినప్పటికీ, ఆ చాట్‌ను బహిర్గతం చేసిన సీబీఐ.. సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా ప్రమేయం ఉందని చెప్తోంది.

2017 మార్చి 8న డ్రగ్ డీలర్ గౌరవ్‌తో చాట్ చేసింది రియా. ఇందులో హార్డ్ డ్రగ్ గురించి చర్చించాలని.. ఇంతకు ముందు దానిని వాడలేదని మెసేజ్ చేసింది. మీ దగ్గర MD (మిథైలీన్ డై ఆక్సీ మెటాఫెంటమైన్) ఉందా? అని అడిగింది. 2019 నవంబర్‌లో జయ సాహా అనే వ్యక్తి నుంచి రియాకు వచ్చిన మెసేజ్‌‌‌‌‌లో సీబీడీ ఆయిల్ కూడా ముంబైలోని వాటర్ స్టోన్ రిసార్ట్‌కు పంపిస్తున్నట్లు ఉంది. కాగా రియా, సుశాంత్ కలిసి ఈ రిసార్ట్‌లో రెండు నెలలు గడిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాహా ఆఫీస్ బాయ్ వాటర్ స్టోన్‌కు రీచ్ అయ్యాడని.. శ్రుతితో కో ఆర్డినేట్ అయి తీసుకోవాలని చెప్పగా.. థాంక్స్ చెప్పింది రియా. దీని తర్వాత డ్రగ్ ఎలా వినియోగించాలో వివరించాడు కూడా. కాఫీ, టీ, లేదా వాటర్‌లో నాలుగు చుక్కలు వేయాలని.. అది తాగిస్తే 30-40 నిమిషాల్లో కిక్ ఎక్కుతుందని చెప్పాడు.

ఈ కేసులో సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా అనుమానిస్తున్నారు సీబీఐ అధికారులు. శామ్యూల్ రియాకు చేసిన మెసేజ్‌లో ‘హాయ్ రియా.. ది స్టఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్’ అని ఉంది. జూన్ 14న సుశాంత్ మరణించగా.. సుశాంత్ సూసైడ్‌కు రియాతో పాటు మరికొంత మంది కారణమంటూ పాట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు సుశాంత్ తండ్రి కేకే సింగ్. డబ్బు దుర్వినియోగం చేశారని, సుశాంత్‌ను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు.

Tags:    

Similar News