మనకూ.. పశువులకు తేడా ఏది : కొరటాల శివ

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో బాధ్యత లేని వ్యక్తులపై సినీ దర్శకుడు కొరటాల శివ అసహనం వ్యక్తం చేశాడు. కరోనా నివారణకు మాస్క్ ఒక్కటే మార్గమని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్యులు, అధికారులు, ప్రభుత్వాలు కోరుతున్నారని గుర్తు చేశారు. ఇంత చెబుతున్నా కొంతమంది మాస్కులు ధరించకుండా తిరిగితే మనకు, పశువులకు తేడా ఉండదని ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి తగ్గాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులను […]

Update: 2020-07-21 10:19 GMT

దిశ, వెబ్ డెస్క్ :
సమాజంలో బాధ్యత లేని వ్యక్తులపై సినీ దర్శకుడు కొరటాల శివ అసహనం వ్యక్తం చేశాడు. కరోనా నివారణకు మాస్క్ ఒక్కటే మార్గమని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్యులు, అధికారులు, ప్రభుత్వాలు కోరుతున్నారని గుర్తు చేశారు. ఇంత చెబుతున్నా కొంతమంది మాస్కులు ధరించకుండా తిరిగితే మనకు, పశువులకు తేడా ఉండదని ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి తగ్గాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులను కూడా మూతి, ముక్కు కవర్ అయ్యేలా కట్టుకోవాలని కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..