అలర్ట్.. జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న పెగాసస్ స్పై వేర్.. ఫోన్ హ్యాక్.?

దిశ, ఫీచర్స్ : పెగాసస్ సాఫ్ట్‌వేర్ 2019లో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ టైమ్‌లో పలువురు జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో స్పై వేర్ చేరిందని హెచ్చరిస్తూ అలర్ట్ మెసేజెస్ పంపిన వాట్సాప్.. సదరు యూజర్లను లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని చెప్పడంతో ఇష్యూ బయటపడింది. తాజాగా మరోసారి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ అంశం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో రాజకీయ నాయకులు, ఉద్యమకారులతో పాటు 40కి పైగా జర్నలిస్టులు లక్ష్యంగా వారి ఫోన్ నంబర్లపై ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నిఘా ఉంచినట్లు […]

Update: 2021-07-19 08:54 GMT

దిశ, ఫీచర్స్ : పెగాసస్ సాఫ్ట్‌వేర్ 2019లో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ టైమ్‌లో పలువురు జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో స్పై వేర్ చేరిందని హెచ్చరిస్తూ అలర్ట్ మెసేజెస్ పంపిన వాట్సాప్.. సదరు యూజర్లను లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని చెప్పడంతో ఇష్యూ బయటపడింది. తాజాగా మరోసారి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ అంశం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో రాజకీయ నాయకులు, ఉద్యమకారులతో పాటు 40కి పైగా జర్నలిస్టులు లక్ష్యంగా వారి ఫోన్ నంబర్లపై ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నిఘా ఉంచినట్లు సమాచారం. ఇంతకీ పెగాసస్ సాఫ్ట్‌వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఏవిధంగా హ్యాక్ చేసి సమచారాన్ని తస్కరిస్తుంది?

ఇజ్రాయెల్ టెక్ సంస్థ ‘NSO గ్రూప్’.. ఈ అధునాతమైన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోన్లలోకి సులభంగా చొరబడి హ్యాక్ చేయగలదు. అయితే ఈ సాఫ్ట్‌వేర్ దుర్వినియోగం విషయంలో తాము ఎలాంటి బాధ్యత వహించమని NSO గ్రూప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఈ టూల్‌ను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్‌లో యూజ్ చేకునేందుకు వీలుగా ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని, ఇతర సంస్థలు లేదా వ్యక్తులకు కాదని పేర్కొంది.

ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది?

పెగాసస్ స్పై వేర్ మీ ఫోన్‌లో ఉన్నట్టు గుర్తించడం అసాధ్యం. వాట్సాప్ లేదా ఇతర సిమిలర్ యాప్స్ నుంచి వాయిస్ కాల్ ద్వారా కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఫోన్‌లో చొరబడవచ్చు. కాల్ లిఫ్ట్ చేయకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవడమే కాక, ఈ విషయం యూజర్‌కు తెలియకుండా ఉండేలా కాల్‌లాగ్‌ను కూడా డిలీట్ చేస్తుంది. ఇంకా ఫోన్‌కు పంపబడిన మాలిషియస్ ‘యూఆర్ఎల్‌’ను క్లిక్ చేయడం ద్వారా డివైస్ హ్యాక్ అయిపోతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్ అయిందంటే చాలు.. ఎన్‌క్రిప్టెడ్ చాట్స్, ఫైల్స్‌తో సహా మొబైల్‌లోని ప్రతీ సమాచారాన్ని సేకరిస్తుంది. మెసేజెస్, కాల్స్, యాప్ యాక్టివిటీ, యూజర్ లొకేషన్, వీడియో కెమెరా, మైక్రోఫోన్‌కు కూడా యాక్సెస్ కాగలదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక పెగాసస్ సాఫ్ట్‌వేర్ సామర్థ్యాల గురించి వెల్లడించిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘కాస్పర్‌స్కై’కి చెందిన రీసెర్చర్స్.. ‘టోటల్ సర్వైలెన్స్’ అనే పదాన్ని వాడారంటేనే ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఎలా వదిలించుకోవాలి?

పెగాసస్‌ను పూర్తిగా వదిలించుకునేందుకు ఫోన్‌ను డిస్‌కార్డ్ చేయడమొక్కటే మార్గమని సైబర్‌ సెక్యూరిటీ విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ ఇన్ఫెక్ట్ అయితే అటాకర్స్ ఖచ్చితంగా ఆన్‌లైన్ అకౌంట్స్ అన్నింటికీ యాక్సెస్ సంపాదిస్తారు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ను రీస్టార్ట్ చేసినప్పటికీ ‘స్పై వేర్’ ఫోన్ నుంచి పూర్తిగా తొలగిపోదని సిటిజెన్ ల్యాబ్ సూచించింది. మరొక విషయం ఏంటంటే.. ఒకవేళ మీరు డివైస్‌ను మార్చినా, అందులోని యాప్స్ అన్నీ తాజాగా ఇన్‌స్టాల్ చేసినవే ఉన్నాయో లేదో చూసుకోవాలి. అంతేకాదు హ్యాక్ అయినట్టు తెలిస్తే.. క్లౌడ్ ఖాతాలను తొలగించి, మెరుగైన భద్రత కోసం అన్ని పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి.

Tags:    

Similar News