‘జగన్ గారూ.. ఇలాచేసి ప్రజలకు ఏం సంకేలిస్తున్నారు..?’ :Nara Lokesh
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కరోనాపై అవగాహనకోసం కోట్లరూపాయలు ఖర్చుచేసి మీఫోటో, పేరుతో మాస్కు పెట్టుకోవాలని చెబుతున్న మీరే మాస్కు పెట్టుకోకుండా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన పోస్టు చేశారు. కరోనా మొదటి వేవ్‌లో కొవిడ్ చిన్నపాటి జ్వరంలాంటిదని పారాసెటమాల్ వేస్తే పోతుందని, బ్లీచింగ్ చల్లితే చస్తుందని అవగాహన లేకుండా మాట్లాడి వేలమంది ప్రజల ప్రాణాలు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కరోనాపై అవగాహనకోసం కోట్లరూపాయలు ఖర్చుచేసి మీఫోటో, పేరుతో మాస్కు పెట్టుకోవాలని చెబుతున్న మీరే మాస్కు పెట్టుకోకుండా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన పోస్టు చేశారు. కరోనా మొదటి వేవ్‌లో కొవిడ్ చిన్నపాటి జ్వరంలాంటిదని పారాసెటమాల్ వేస్తే పోతుందని, బ్లీచింగ్ చల్లితే చస్తుందని అవగాహన లేకుండా మాట్లాడి వేలమంది ప్రజల ప్రాణాలు బలిచ్చారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? (1/3) pic.twitter.com/cpDVwgzv0A
— Lokesh Nara (@naralokesh) May 20, 2021