తెలంగాణకు దీదీ సాయం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు తెలంగాణ సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు సైతం విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు విరాళాలు ప్రకటించారు. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లువిరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు తెలంగాణ సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు సైతం విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు విరాళాలు ప్రకటించారు.
ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లువిరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీదీకి కేసీఆర్ ఫోన్ చేసి కొనియాడారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ వేదికగా “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి @MamataOfficial తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో వరదలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజానీకానికి సంఘీభావం తెలిపారు. స్పందనగా సీఎం శ్రీ కేసీఆర్ టెలిఫోన్లో మమతా బెనర్జీతో మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు” అంటూ పోస్ట్ చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి @MamataOfficial తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో వరదలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజానీకానికి సంఘీభావం తెలిపారు. స్పందనగా సీఎం శ్రీ కేసీఆర్ టెలిఫోన్లో మమతా బెనర్జీతో మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) October 20, 2020