బుధవారం పంచాంగం, రాశి ఫలాలు (14-04-2021)

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం తిధి : విదియ ఉ10.42 తదుపరి తదియ వారం: బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం: భరణి మ3.32 తదుపరి కృత్తిక యోగం: ప్రీతి మ2.43 తదుపరి ఆయుష్మాన్ కరణం : కౌలువ ఉ10.42 తదుపరి తైతుల రా11.45 ఆ తదుపరి గరజి వర్జ్యం : తె4.51నుండి దుర్ముహూర్తం : ఉ11.48 – 12.37 అమృతకాలం: ఉ10.13 – 11.59 రాహుకాలం : మ12.00 […]

Update: 2021-04-13 22:06 GMT

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : విదియ ఉ10.42 తదుపరి తదియ
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: భరణి మ3.32 తదుపరి కృత్తిక
యోగం: ప్రీతి మ2.43 తదుపరి ఆయుష్మాన్
కరణం : కౌలువ ఉ10.42 తదుపరి తైతుల రా11.45 ఆ తదుపరి గరజి
వర్జ్యం : తె4.51నుండి
దుర్ముహూర్తం : ఉ11.48 – 12.37
అమృతకాలం: ఉ10.13 – 11.59
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30- 9.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.50
సూర్యాస్తమయం: 6.10

నేటి రాశి ఫలాలు ఇలా..

మేషం

చాలాకాలంగా పూర్తికాని పనులు చకచకా సాగుతాయి. సన్నిహితుల సహాయం సహకారాలు అందుతాయి. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబమున కీలక నిర్ణయాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం కలుగుతుంది.

మిధునం

సంఘంలో ప్రముఖుల ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సేవ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి.

కర్కాటకం

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఉంటాయి ఉద్యోగస్తులు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

సింహం

తల్లి తండ్రుల ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. కొన్ని వ్యవహారాలు అకస్మాత్తుగా నిలిచిపోతాయి. వ్యాపారాలలో రెండురకముల ఆలోచనలుచేసి ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య

కుటుంబ సభ్యుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు కష్టంమీద పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగాఉండవు. వృత్తి, ఉద్యోగాలు కొంత స్వల్పంగా లాభిస్తాయి.

తుల

సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికీ లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు వృత్తి,ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ విషయమై పెద్దలతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు

సంతాన సంబంధిత ఇబ్బందులు ఉంటాయి.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు ఉంటాయి.

మకరం

చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు చికాకుగా ఉంటాయి.

కుంభం

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరించి ఆదరణ పొందుతారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్ధిరాస్తి నూతన ఒప్పందాలు కుదురుతాయి. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీనం

ఖర్చుకు తగిన ఆదాయం లభించదు. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.

Tags:    

Similar News