వెడ్డింగ్ షూట్‌ పై బేరూత్ పేలుడు ఎఫెక్ట్

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్‌లో పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు లెబనాన్‌ రాజధాని బేరూత్‌ పేలుడు ధాటికి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పేలుడు శబ్ధానికి బేరూత్ ఒక్కసారిగా కంపించింది. ఈ ఎఫెక్ట్ పోర్టుకు సమీపంలో ఉన్న ఇండ్లపై తీవ్ర ప్రభావం చూపింది. భూకంపం వచ్చిందేమో అని జనాలు ఒక్కసారిగా వణికిపోయారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో పోర్టుకు సమీపంలో ఉన్న ఓ స్టూడియోలో వెడ్డింగ్ […]

Update: 2020-08-06 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్‌లో పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు లెబనాన్‌ రాజధాని బేరూత్‌ పేలుడు ధాటికి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పేలుడు శబ్ధానికి బేరూత్ ఒక్కసారిగా కంపించింది. ఈ ఎఫెక్ట్ పోర్టుకు సమీపంలో ఉన్న ఇండ్లపై తీవ్ర ప్రభావం చూపింది. భూకంపం వచ్చిందేమో అని జనాలు ఒక్కసారిగా వణికిపోయారు.

అయితే, సరిగ్గా ఇదే సమయంలో పోర్టుకు సమీపంలో ఉన్న ఓ స్టూడియోలో వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. అప్పటివరకు హెచ్‌డీ క్లారిటీతో పెండ్లి కూతురు కెమెరాలో దర్శనమిస్తూ ఉంది. పేలుడు ధాటికి ఒక్కసారిగా అక్కడ భూమి కంపించడంతో.. భయాందోళన చెందిన కెమెరామెన్ పరుగులు పెట్టాడు. ఇక పెండ్లి కూతరు అప్రమత్తమై పెండ్లి కొడుకు చేయి పట్టుకుని స్టూడియో నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటివరకు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం పేలుడు దాటికి పరిస్థితి ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ వీడియో చక్కటి ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

Tags:    

Similar News