భారీ వరదల నడుమ వెడ్డింగ్ ఫొటోషూట్

దిశ, ఫీచర్స్ : ఓ వైపు భారీ వరద ఉప్పొంగుతోంది. వరదల నుంచి తప్పించుకునేందుకు 18 వేల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రదేశానికి వెళ్లారు. కానీ ఆ పరిస్థితులేవీ వాళ్లను భయపెట్టలేదు సరి కదా, అక్కడే ఓ బ్రిడ్జి వద్ద ఓ జంట కూల్‌గా ఫొటోషూట్ కానిచ్చేసింది. వీరు త్వరలోనే పెళ్లిచేసు కోబోతుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన కేట్ ఫాదరింగమ్ పెళ్లికి ముందు న్యూ సౌత్ […]

Update: 2021-03-23 08:10 GMT

దిశ, ఫీచర్స్ : ఓ వైపు భారీ వరద ఉప్పొంగుతోంది. వరదల నుంచి తప్పించుకునేందుకు 18 వేల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రదేశానికి వెళ్లారు. కానీ ఆ పరిస్థితులేవీ వాళ్లను భయపెట్టలేదు సరి కదా, అక్కడే ఓ బ్రిడ్జి వద్ద ఓ జంట కూల్‌గా ఫొటోషూట్ కానిచ్చేసింది. వీరు త్వరలోనే పెళ్లిచేసు కోబోతుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన కేట్ ఫాదరింగమ్ పెళ్లికి ముందు న్యూ సౌత్ వేల్స్‌లోని తన పేరెంట్స్ ఇంటికి వచ్చింది.

ఇంకా ఒకరోజు ఆగితే ఆమెకు వేన్ బెల్‌తో వివాహం జరుగుతుందనగా, ఆ ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. అధికారుల సూచన మేరకు స్థానికులంతా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లగా, కేట్ మాత్రం తన కుటుంబీకులతో అక్కడే ఉండిపోయింది. చివరకు ‘తనను రక్షించండి’ అంటూ షోషల్ మీడియా వేదికగా పెట్టిన రిక్వెస్ట్‌కు ‘అఫినిటీ హెలికాప్టర్స్’ వారు స్పందించి చాపర్ పంపారు. అలా చాపర్‌లో కొద్ది దూరం వెళ్లిన మీదట అక్కడి నుంచి వెడ్డింగ్ ప్లేస్‌‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఒక ప్రదేశంలో ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే ముహూర్త సమయం దాటిపోతుండటంతో ‘కేట్, బెల్’ భారీ వరద ప్రవహిస్తున్న ఆ బ్రిడ్జి సమీపంలోనే కిస్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ట్రెండవుతున్నాయి. కాగా ఆ మరుసటి రోజు వారు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News