చేనేతల సమస్యల సాధనకు త్వరలోనే భారీ ధర్నా : ప్రొ.కోదండ రాం
తెలంగాణలో చేనేతకార్మికుల సమస్యల సాధనకై త్వరలోనే భారీ ధర్నా నిర్వహించనున్నామని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ఈ ధర్నాతో రాష్ట్రంలోని సకల వృత్తుల్లో కదలిక రావాలని ఆకాంక్షించారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో నేతన్నల జేఏసీ ఆధ్వర్యంలో చేనేత సమస్యల సాధనకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండ రాం మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే ఈ ధర్నా చేసి ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలని వెల్లడించారు. […]
తెలంగాణలో చేనేతకార్మికుల సమస్యల సాధనకై త్వరలోనే భారీ ధర్నా నిర్వహించనున్నామని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ఈ ధర్నాతో రాష్ట్రంలోని సకల వృత్తుల్లో కదలిక రావాలని ఆకాంక్షించారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో నేతన్నల జేఏసీ ఆధ్వర్యంలో చేనేత సమస్యల సాధనకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండ రాం మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే ఈ ధర్నా చేసి ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలని వెల్లడించారు. నేటి కాలంలో రియలెస్టేట్, కాంట్రాక్టర్ల చేతిలోనే రాజ్యాధికారం ఉందని ఆరోపించారు.
జేఏసీ చైర్మెన్ దాసు సురేష్ మాట్లాడుతూ..
చేనేత వ్యవస్థలో జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. చేనేత కార్మికుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆరేండ్లలో చేనేతలకు ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ మాట్లాడుతూ.. యంత్ర పరికరాలు వచ్చినప్పట్నుంచీ, చేనేతలు పోటీపడే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత అన్నల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. ఈ వృత్తి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చేనేతల కోసం ఏ ఉద్యమం చేసినా తమ పార్టీ మద్దతు ఉంటుందని వెల్లడించారు.