అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాల కారణంగా ఈనెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, కోస్తాంధ్రలో పలు చోట్ల భార్షీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే […]

Update: 2021-06-07 20:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాల కారణంగా ఈనెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, కోస్తాంధ్రలో పలు చోట్ల భార్షీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

 

Tags:    

Similar News