పోలీసుల తనిఖీల్లో మారణాయుధాలు.. ఐదుగురు అరెస్ట్
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విట్టు నాయక్ తండా శివారు పరిధిలో సంగాపూర్ రోడ్డు పై కారులో మారణాయుధాలు తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తిపోతల సంగ పూర్ తండా దగ్గర పోలీసులు ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కారు, ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేస్తున్న […]
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విట్టు నాయక్ తండా శివారు పరిధిలో సంగాపూర్ రోడ్డు పై కారులో మారణాయుధాలు తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తిపోతల సంగ పూర్ తండా దగ్గర పోలీసులు ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కారు, ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి వారి వాహనాలను ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేసారు.
ఈ ఘటనతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని కారులో తనిఖీలు చేపట్టారు. కారులో ఎలాంటి అనుమతులు లేని ఒక ఎయిర్ పిస్టల్, రెండు పదునైన కత్తులు, ఒక ఎక్స్ టైండెడ్ ఐరన్ రాడ్, ఒక బేస్ బాల్ స్టిక్లు పోలీస్లకు లభించాయి. పోలీస్లు అదుపులోకి తీసుకున్న వారిలో అభిలాష్, బబ్లు, బసవసాగర్, సచిన్ కుమార్, మెరిల్లు ఉన్నారు. ఈ మేరకు అక్రమంగా మారణాయుధాలను తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్కు తరలించినట్టు చిరాగ్ పల్లి పోలీసులు తెలిపారు.