అన్ని భాషలకు అధికారిక గుర్తింపు కోసం పనిచేస్తాం: తమిళనాడు సీఎం
చెన్నై: తమిళం సహా రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లోని భాషలన్నింటికీ అధికారిక గుర్తింపు కోసం పనిచేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం అన్నారు. తమిళం భాషను 2004లో ఇదే రోజున క్లాసికల్ లాంగ్వేజ్‌గా ప్రకటిస్తామని పేర్కొన్నట్టుగా గుర్తుచేశారు. అప్పటి సీఎం ఎం కరుణానిధి తమిళానికి గుర్తింపు కోసం శ్రమించారని వివరించారు. తమ ప్రభుత్వం అదే కృషిని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. తమిళానికి క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తింపునిస్తూ 2004 అక్టోబర్ 12న కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళం […]
చెన్నై: తమిళం సహా రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లోని భాషలన్నింటికీ అధికారిక గుర్తింపు కోసం పనిచేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం అన్నారు. తమిళం భాషను 2004లో ఇదే రోజున క్లాసికల్ లాంగ్వేజ్‌గా ప్రకటిస్తామని పేర్కొన్నట్టుగా గుర్తుచేశారు. అప్పటి సీఎం ఎం కరుణానిధి తమిళానికి గుర్తింపు కోసం శ్రమించారని వివరించారు. తమ ప్రభుత్వం అదే కృషిని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
తమిళానికి క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తింపునిస్తూ 2004 అక్టోబర్ 12న కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళం సహా ఎనిమిదవ షెడ్యూల్‌లోని భాషలన్నింటికీ అధికారిక గుర్తింపు కోసం పనిచేస్తామని వివరించారు. 2004లో తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం, ఇతర భాషలనూ క్లాసికల్ లాంగ్వేజ్‌గా కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం, దేశ అధికారిక భాషగా హిందీ ఉన్నది. ఎనిమిదో షెడ్యూల్‌లో హిందీ సహా 22 భాషలున్నాయి.